Zomato: జొమాటోకు మరో ఎదురు దెబ్బ

Zomato:Tiger Global sells half of the stake sells 185 million shares - Sakshi

జొమాటోలో వాటా తగ్గించుకున్న టైగర్‌ గ్లోబల్‌ 

న్యూఢిల్లీ: ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటోకు మరో షాక్‌  తగిలింది. పెట్టుబడి సంస్థ టైగర్ గ్లోబల్ బహిరంగ మార్కెట్‌లో 18.45 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా కంపెనీలో దాదాపు సగం వాటాను 2.77 శాతానికి తగ్గించుకున్నట్లు జోమాటో గురువారం తెలిపింది. 

న్యూయార్క్‌కు చెందిన హెడ్జ్ ఫండ్ కంపెనీ టైగర్‌ గ్లోబల్‌ తన వాటాను దాదాపు సంగానికి తగ్గించుకుంది. జూలై 25 నుంచి ఆగస్ట్‌ 2 మధ్య ఓపెన్‌ మార్కెట్లో 18.45 కోట్ల షేర్లను విక్రయించడంతో టైగర్‌ గ్లోబల్‌కు చెందిన ఇంటర్నెట్‌ ఫండ్‌-6 వాటా 5.11 నుంచి 2.77 శాతానికి వచ్చి చేరింది.  (భారత్‌ వాణిజ్యానికి సంస్కరణలు కీలకం)

టైగర్ గ్లోబల్ మొదటిసారిగా సెప్టెంబర్ 2020లో జొమాటోలో 102.5 మిలియన్లడాలర్ల  మేర పెట్టుబడి పెట్టింది.   ఫిబ్రవరి 2021లో 250 మిలియన్ల డాలర్లు ఫండింగ్‌ చేసింది. ఆగస్ట్ 3 నాటికి జొమాటో మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 5.74 బిలియన్‌ డాలర్లుగాఉంది. కాగా, జొమాటోలో రూ.3,088 కోట్ల విలువైన 61.2 కోట్ల షేర్లను ట్యాక్సీ సేవల సంస్థ ఉబర్‌ ఓపెన్‌ మార్కెట్లో బుధవారం విక్రయించిన సంగతి తెలిసిందే. (OnePlus10T 5G: వన్‌ప్లస్‌ 10 టీ వచ్చేసింది..ఆఫర్‌ అదిరింది!)

(ఇదీ చదవండిఅయిదేళ్లలో రెండింతలు: డిజిటల్‌ రేడియోకు అదరిపోయే వార్త)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top