స్మార్ట్‌ఫోన్లతో ఎక్కువ సమయం గడుపుతున్నారా?

Young people Be Suffering From Nomophobia - Sakshi

యువతపై తీవ్ర ప్రభావం

మానసిక కుంగుబాటుకు ఆస్కారం

స్మార్ట్‌ఫోన్‌లతో దెబ్బతింటున్న ఆరోగ్యం

మీరు ప్రతి రోజు స్మార్ట్‌ఫోన్‌లపైనే ఎక్కువ సమయం గడుపుతున్నారా? అయితే జాగ్రత్త దాదాపు నాలుగింట ఒక వంతు యువత తమ స్మార్ట్‌ఫోన్‌లపైనే ఎక్కువగా ఆధారపడటం వల్ల అది ఒక వ్యసనంలాగా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని మానసిక వైద్యుల పరిశోధనలు సూచిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లను రోజువారీగా ఎక్కువ ఉపయోగించడం ద్వారా మానసిక ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. ఇటీవల వచ్చిన ఒక నివేదిక ప్రకారం యువత ఫోన్‌లో ఎక్కువ సమయం గడపడం వల్ల వారు ఫోన్ పై నియంత్రణను కోల్పోతున్నట్లు తెలుస్తుంది.(చదవండి: ఈ వారంలో టాప్ - 10 ట్రెండింగ్‌ ఫోన్స్ ఇవే!)

బీఎంసీ సైకియాట్రీలో ప్రచురించిన నివేదిక ప్రకారం.. మొబైల్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల కలిగే పరిణామాలను తెలుసుకోవడం కోసం దర్యాప్తులో భాగంగా 42,000 మంది యువత  మీద పరిశోధనలు జరిపినట్లు తెలిపారు. ఇందులో 23 శాతం మంది మానసిక ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు కనుగొన్నారు. వారు ఫోన్‌ను ఉపయోగించలేకుండా ఉండలేక పోవడం, సమయం విషయంలో నియంత్రణను కోల్పోవడం వంటి విషయాలను గమనించినట్లు తెలిపారు. మొబైల్ ని ఎక్కువగా వాడటం వల్ల ఒత్తిడికి గురిఅవ్వడం, మానసిక స్థితి సరిగా లేకపోవడం, వృత్తిపరమైన లక్ష్యాలను సాధించ లేకపోవడం, కుటుంబాన్ని, బంధువులను పట్టించుకోకుండా ఏకాంతంగా ఉండటం చేస్తున్నట్లు తెలిపారు. ఎవరినీ పట్టించుకోకుండా స్వార్థంగా తయారయ్యే ప్రమాదం కూడా ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ద్వారా నెగెటివ్ ఆలోచనలు భాగా పెరుగుతునట్లు తెలుస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.

మానసికంగా కుంగుబాటుకు గురిఅవుతూ ఆత్మహత్యలకు కూడా ప్రయత్నిస్తునట్లు నివేదికలో తేలాయి. వీటికి అన్నింటికీ మూలం స్మార్ట్ఫోన్ లేక వారు ఉపయోగించే యాప్స్ అనేది తెలియడం లేదు అని డాక్టర్ నికోలా కాల్క్ అన్నారు. అందుకోసమే పిల్లలు, యువకులు స్మార్ట్ఫోన్ వాడకం విషయంలో అవగాహన కల్పించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు తమ ఫోన్లలో ఎంత సమయం గడుపుతారో తెలుసుకోవాలి లేకపోతే వారి మానసిక ఆరోగ్యం, రోజువారీ పనితీరుపై తీవ్రమైన పరిణామాలను కలిగిస్తాయి అని సహ రచయిత సమంతా సోహ్న్ హెచ్చరించారు. (చదవండి: పబ్జి లవర్స్ జర జాగ్రత్త)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top