ముచ్చటైన పెన్ను.. మూడు భాషల నిఘంటువు చేతిలో ఉన్నట్లే! | Sakshi
Sakshi News home page

ముచ్చటైన పెన్ను.. మూడు భాషల నిఘంటువు చేతిలో ఉన్నట్లే!

Published Sun, Jul 2 2023 12:49 PM

Youdao Dictionary Pen smart scanning pen helps language learning translation - Sakshi

ఇది మూడు భాషల ముచ్చటైన పెన్ను. ఇది చేతిలో ఉంటే, మూడు భాషల నిఘంటువు చేతిలో ఉన్నట్లే! దీంతో రాయడానికి సాధ్యంకాదు గాని, దీనివల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. చైనీస్‌ కంపెనీ ‘స్మార్ట్‌ యుడావో’ ఇటీవలే ఈ పెన్నును మార్కెట్‌లోకి తెచ్చింది. చైనీస్, ఇంగ్లిష్, స్పానిష్‌ భాషల్లోని పదాలను, వాక్యాలను ఈ పెన్ను ఒక భాష నుంచి మరో భాషలోకి ఇట్టే అనువదిస్తుంది.

మామూలు పుస్తకం లేదా ఈ–బుక్‌లోని వ్యాక్యాలను ఈ పెన్నుతో స్కాన్‌ చేస్తూ ఉంటే, కోరుకున్న భాషలోకి అనువదిస్తుంది. అంతేకాదు, తెలియని పదాలకు గల అర్థాలను, పర్యాయపదాలను చెబుతుంది. విద్యార్థులకు, భాషలను ప్రత్యేకంగా అధ్యయనం చేసే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే ఈ పెన్ను ధర 199.99 డాలర్లు (రూ.16,474) మాత్రమే!

Advertisement
 
Advertisement
 
Advertisement