
1994లో ప్రారంభమైన ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ లిమిటెడ్ (ABSLAMC) సంస్థకు ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ & సన్ లైఫ్ (ఇండియా) ఏఎంసీ ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్ వంటివి ప్రమోటర్లు, ప్రధాన వాటాదారులుగా వ్యవహరిస్తున్నారు. ఏబీఎస్ఎల్ఏఎంసీ, ఇండియన్ ట్రస్ట్స్ యాక్ట్ 1882 ప్రకారం నమోదైన.. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్‌కు పెట్టుబడి ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్‌గా సేవలు అందిస్తోంది.
ఇటీవల నిర్వహించిన 'వెల్త్ క్రియేషన్ స్టడీ' ప్రకారం, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ద్వారా నెలవారీగా రూ.10,000 చొప్పున 25 సంవత్సరాల పాటు కొనసాగించిన సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ద్వారా రూ.1.6 కోట్లకు పైగా విలువను సాధించింది. ఈ కాలంలో ఫండ్ 11.7 శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటును నమోదు చేసినట్లు ఈ అధ్యయనం సూచించింది.
పెరుగుతున్న ఈక్విటీ మార్కెట్ అవకాశాలను, తక్కువ స్థాయిలో ఉన్న అస్థిరతతో అన్వేషించాలనుకునే పెట్టుబడిదారులకు, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఉపయోగకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని, ఈ ఫండ్ మార్కెట్ మదింపుల ఆధారంగా ఈక్విటీ, స్థిర ఆదాయ పెట్టుబడుల మోతాదును డైనమిక్‌గా సమతుల్యం చేస్తుంది. ఈ ఫండ్‌లోని డైనమిక్ అసెట్ అలోకేషన్ మోడల్ అధిక విలువల వద్ద ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ను స్వయంచాలకంగా తగ్గించడంతో పాటు, రాబడుల్లో అస్థిరతను తగ్గించడంలో సహాయపడుతుంది.
చారిత్రాత్మకంగా పరిశీలించినట్లయితే.. విస్తృత మార్కెట్లతో పోల్చినపుడు ఈ ఫండ్ తక్కువ డ్రాడౌన్‌లు (నష్టాల తీవ్రత) కలిగి ఉండి, వేగంగా పునరుద్ధరణను సాధించింది. ఈ ఫండ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే.. నష్టాల నుంచి స్థిరమైన రక్షణ కల్పించడం. 2015 తర్వాత, ఈ ఫండ్ సగటు 52 శాతం నికర ఈక్విటీ ఎక్స్‌పోజర్ ఉన్నప్పటికీ, నిఫ్టీ రాబడిలో 80 శాతం వరకు సంపాదించడంలో విజయం సాధించింది.
ఫండ్ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ లిమిటెడ్ ఎండీ & సీఈఓ ఎ. బాలసుబ్రమణియన్ మాట్లాడుతూ.. ''ఆదిత్య బిర్లా సన్ లైఫ్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ తన 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేయడం అనేది.. కేవలం ఒక పనితీరు ఆధారిత మైలురాయి మాత్రమే కాదు, ఇది మా పెట్టుబడిదారుల శాశ్వతమైన విశ్వాసానికి, అలాగే మా బృందం యొక్క నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. మార్కెట్ స్థితిగతుల ఆధారంగా ఈక్విటీ, స్థిర ఆదాయ ఎక్స్పోజర్‌ను డైనమిక్‌గా సర్దుబాటు చేయడం ద్వారా తక్కువ అస్థిరతతో సహేతుకమైన రాబడులు అందించడమే ఈ ఫండ్ యొక్క లక్ష్యం అని అన్నారు.
ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?
ఇది పెట్టుబడిదారులకు ఆత్మవిశ్వాసంతో కూడిన పెట్టుబడి అనుభూతిని కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫండ్, నాణ్యమైన, సమతుల్య పోర్ట్ఫోలియో నిర్వహణకు కట్టుబడి, ఆల్ఫా సృష్టి లక్ష్యంతో వివిధ రంగాలు, మార్కెట్ క్యాపిటలైజేషన్‌లలో వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెడుతుంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ తమ పెట్టుబడిదారులకు అత్యుత్తమ పెట్టుబడి అనుభవం అందించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. మార్కెట్ మార్గసూచకాలు ఎలాంటి దశలో ఉన్నా.. బుల్ అయినా బేర్ అయినా.. మాపై విశ్వాసం కొనసాగించిన ప్రతీ ఒక్క పెట్టుబడిదారునికి మరియు వ్యాపార భాగస్వామికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని బాలసుబ్రమణియన్ అన్నారు
ఈ ఫండ్‌ను హరీష్ కృష్ణన్, లవ్లీష్ సోలంకి, మోహిత్ శర్మ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. 2025 ఏప్రిల్ 30 నాటికి, ఈ ఫండ్‌కి రూ.7,500 కోట్లకు పైగా ఆస్తులు నిర్వహణలో ఉన్నాయి.