హైదరాబాద్‌కు చేరిన కొత్త స్క్రాంబ్లర్ బైకులు! | Yezdi BSA Scramblers Now Available in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు చేరిన కొత్త స్క్రాంబ్లర్ బైకులు!

Jun 8 2026 10:35 PM | Updated on Jun 8 2026 10:35 PM

Yezdi BSA Scramblers Now Available in Hyderabad

యెజ్డీ, BSA సంస్థలు తమ కొత్త స్క్రాంబ్లర్స్ రీటైల్ విడుదలను ప్రకటించాయి. అవి ఇప్పుడు హైదరాబాద్ తమ అథీకృత డీలర్‌షిప్‌లలో లభిస్తున్నాయి.

యెజ్డీ స్క్రాంబ్లర్ 350, BSA స్క్రాంబ్లర్ 650లు ప్రత్యేకంగా రూపొందించిన పవర్ ట్రైయిన్ మాత్రమే కాకుండా.. శక్తివంతమైన, ఆకర్షణీయమైన డిజైన్ పొందుతాయి. నగర ప్రయాణాలకు, రోజువారీ వినియోగానికి 350 సీసీ బైకులు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇందులోని లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. యెజ్దీ స్క్రాంబ్లర్ 350 బైక్ ధర రూ.1,99,950 కాగా.. BSA స్క్రాంబ్లర్ 650 ధర రూ. 3,24,950.

BSA స్క్రాంబ్లర్ 650 అసలైన బ్రిటిష్ స్క్రాంబ్లర్ స్టైల్ పొందుతుంది. దీని డిజైన్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గోల్డ్ స్టార్ కటాలినా, A10 స్పిట్ ఫైర్, A65 ఫైర్ బర్డ్ వంటి చారిత్రక దిగ్గజాల నుంచి స్వీకరించినట్లు తెలుస్తుంది. అయితే ఈ రెండు బైకులు.. అత్యుత్తమ పనితీరును అందిస్తాయని సంస్థ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement