బ్యాంకింగ్‌లో మరిన్ని విదేశీ సంస్థల ఎంట్రీకి సానుకూలం  | YES BANK Stake Could Set Stage for More Foreign Participation in Indian Banks | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్‌లో మరిన్ని విదేశీ సంస్థల ఎంట్రీకి సానుకూలం 

May 30 2025 1:48 AM | Updated on May 30 2025 8:16 AM

YES BANK Stake Could Set Stage for More Foreign Participation in Indian Banks

యస్‌బ్యాంక్‌లో ఎస్‌ఎంఎఫ్‌జీ వాటాలు కొనడంపై ఫిచ్‌ రేటింగ్స్‌

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ యస్‌బ్యాంక్‌లో సుమితోమో మిత్సుయి ఫైనాన్షియల్‌ గ్రూప్‌ (ఎస్‌ఎంఎఫ్‌జీ) 20 శాతం వాటాలు కొనుగోలు చేయడమనేది భారతీయ బ్యాంకింగ్‌ రంగంలో ఇతర విదేశీ సంస్థల ప్రవేశానికి సానుకూలాంశంగా ఉంటుందని ఫిచ్‌ రేటింగ్స్‌ అభిప్రాయపడింది. 

ఈ డీల్‌తో యస్‌బ్యాంకులో అతి పెద్ద వాటాదారుగా బోర్డులో ఇద్దరిని నియమించుకోవడంతో పాటు బ్యాంకుపై ఎస్‌ఎంఎఫ్‌జీకి గణనీయమైన నియంత్రణ కూడా లభిస్తుందని పేర్కొంది. ఈ లావాదేవీని పరిగణనలోకి తీసుకుంటే భవిష్యత్తులోను ఇలాంటి డీల్స్‌ మరిన్ని నమోదు కావచ్చని వివరించింది. 

వోటింగ్‌ హక్కులు, పెట్టుబడి పరిమితులను పెంచితే విదేశీ బ్యాంకు ఇన్వెస్టర్లు మరింత ఆసక్తి చూపించవచ్చని పేర్కొంది. భారత్‌లో కార్యకలాపాలను విస్తరించాలనుకుంటున్న విదేశీ బ్యాంకులు.. దేశీయంగా మధ్య స్థాయి బ్యాంకుల్లో ఇన్వెస్ట్‌ చేయొచ్చని వివరించింది. ప్రస్తుతం విదేశీ పెట్టుబడుల నిబంధనల ప్రకారం భారతీయ బ్యాంకుల్లో విదేశీ సంస్థల ఓటింగ్‌ హక్కులపై 26 శాతం, పెట్టుబడులపై 15 శాతం పరిమితి ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement