యస్‌ బ్యాంక్‌కు కొత్త సీఈవో | Vinay Muralidhar Tonse Takes Charge As New MD And CEO Of Yes Bank, More Details Inside | Sakshi
Sakshi News home page

యస్‌ బ్యాంక్‌కు కొత్త సీఈవో

Apr 7 2026 4:47 PM | Updated on Apr 7 2026 5:10 PM

Vinay Muralidhar Tonse Takes Charge as CEO of Yes Bank

ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈవోగా వినయ్‌ మురళీధర్‌ టోన్సే బాధ్యతలు చేపట్టారు. మూడేళ్లపాటు వినయ్‌ బ్యాంకు నిర్వహణను చేపట్టనున్నట్లు యస్‌ బ్యాంక్‌ తాజాగా వెల్లడించింది. ఈ నెల 6తో అదనపు పదవీ కాలం ముగియనున్న ప్రశాంత్‌ కుమార్‌ నుంచి బాధ్యతలు స్వీకరించినట్లు తెలియజేసింది. వేతనం తదితరాలకు ఆర్‌బీఐ ఆమోదముద్ర వేసినట్లు పేర్కొంది.

వినయ్‌ గతంలో పీఎస్‌యూ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐకు ఎండీగా విధులు నిర్వహించారు. యస్‌ బ్యాంక్‌లో గతేడాది జపనీస్‌ దిగ్గజం సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ 24 శాతం వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా అతిపెద్ద ఇన్వెస్టర్‌గా నిలుస్తోంది.

బ్యాంకింగ్‌ రంగంలో మూడున్నర దశాబ్దాలకుపైగా అనుభవమున్న వినయ్‌ ట్రెజరీ, రిటైల్, కార్పొరేట్‌ బ్యాంకింగ్, అంతర్జాతీయ కార్యకలాపాలు, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాలలో పనిచేశారు. బెంగళూరుకు చెందిన సెయింట్‌ జోసెఫ్‌ కామర్స్‌ కాలేజ్‌లో కామర్స్‌ డిగ్రీ, బెంగళూరు యూనివర్శిటీ నుంచి మాస్టర్స్‌ పూర్తి చేశారు. ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా 1988లో కెరీర్‌ ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement