Dish TV: డిష్‌ టీవీ ఫర్‌ సేల్‌..! పోటీలో ప్రధాన కంపెనీలు..!

YES Bank May Offer Dish TV Stake To Tata Sky And Bharti Airtel - Sakshi

లోన్‌ రికవరీలో భాగంగా డిష్‌ టీవీలో దక్కిన 25.6 శాతం వాటాలను యస్‌ బ్యాంకు అమ్మేసే యోచనలో ఉన్నట్లు  తెలుస్తోంది. అందుకుగాను యస్‌ బ్యాంకు దిగ్గజ శాటిలైట్‌ సంస్థలతో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం.

పోటీలో టాటా స్కై, భారతి ఎయిర్‌టెల్‌..!
డిష్‌ టీవీను దక్కించుకునేందుకు దిగ్గజ శాటిలైట్‌ సంస్థలు టాటాస్కై, భారతీ ఎయిర్‌టెల్‌ ముందున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ వ్యవహారంపై ఇరు కంపెనీలు స్పందించలేదు. డిష్‌ టీవీ, యస్‌ బ్యాంకుల మధ్య గత కొద్ది రోజల నుంచి అనిశ్చితి నెలకొంది. కంపెనీపై బాధ్యతలు తమకే ఉంటాయని ఇరు వర్గాలు వాదనలు చేస్తున్నాయి. 

వారికే బెనిఫిట్‌..!
డిష్‌ టీవీ వ్యవహారాలను కంపెనీ ప్రమోటర్‌ సుభాష్‌ చంద్ర ఫ్యామిలీ కంపెనీ కార్యకలాపాలను చూసుకుంటుంది. వీరికి కంపెనీలో ఆరు శాతం వాటాలు కల్గి ఉన్నారు. ఒకవేళ యస్‌బ్యాంకు డిష్‌టీవీ  వాటాలను టాటాస్కై, లేదా ఎయిర్‌టెల్‌ దక్కించుకుంటే ఆయా శాటిలైట్‌ టీవీ కంపెనీలు వాటా గణనీయంగా పెరగనుంది. శాటిలైట్‌ డిష్‌ టీవీ మార్కెట్‌లో 88 శాతంతో టాటాస్కై మొదటిస్థానంలో ఉంది. ఎయిర్‌టెల్‌, డిష్‌ టీవీలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. మార్చి 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో డిష్‌ టీవీ ఆదాయం రూ.14 కోట్లుగా నమోదైంది. అలాగే రూ.67 కోట్ల నష్టాలను చవిచూసింది. డిష్‌ టీవీ మార్కెట్‌ విలువ రూ.8,268 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: 500 కోట్ల పరిహారం అడిగాడు.. ఆపై భార్యతో కలిసి ఫోన్‌లో బండబూతులు తిట్టాడు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top