రూ.5,000 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌.. ఎ‍ప్పుడు, ఎక్కడ

Yamaha Offered Cashback On Fascino 125 And Ray ZR For Frontline Workers - Sakshi

కోవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు యమహా గుడ్‌న్యూస్‌ చెప్పింది. కోవిడ్‌ కష్టకాలంలో వారు చేసిన సేవలకు గుర్తిస్తూ తమ స్కూటర్లపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించింది. యమహా సంస్థను నెలకొల్పి 66 ఏ‍ళ్లు పూర్తైన సందర్భంగా ఈ ఆఫర్‌ అందుబాటులోకి తెచ్చామని యమహా తెలిపింది. 

ఫ్రంట్‌లైన్‌ వారియర్లకే
కరోనా సంక్షోభ సమయంలో రిస్క్‌ చేసి విధులు నిర్వర్తించిన మెడికల్‌ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ఆర్మీ , మున్సిపాలిటీ సిబ్బందికి తమ ఆఫర్‌ వర్తిస్తుందని యమహా తెలిపింది. 

రూ.5000 క్యాష్‌బ్యాక్‌
యమహాలో పాపులర్‌ మోడల్స్‌గా ఉన్న ఫాసినో 125 ఎఫ్‌ఐ, రే జెడ్‌ఆర్‌ 125 ఎఫ్‌ఐ మోడల్స్‌పై రూ. 5,000 డిస్కౌంట్‌ ఇస్తున్నట్టు యమహా ప్రకటించింది. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లందరికీ  క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ వర్తింప చేస్తామని, వారికి తగ్గింపు ధరకే స్కూటర్లు అందిస్తామని యమహా మోటర్‌ గ్రూప్‌ ఇండియా చైర్మన్‌ మోటోఫ్యూమి శితార ప్రకటించారు. 

ఆన్‌రోడ్‌ ప్రైస్‌ @ హైదరాబాద్‌
యమహా ఫాసినో 125 ఎఫ్‌ఐ స్కూటర్‌ ఆన్‌రోడ్‌ ధర హైదరాబాద్‌లో రూ. 87,925 ఉండగా యమహా రే జెడ్‌ఆర్‌ 125 ధర రూ. 91,125గా ఉంది. కోవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వర్కరర్లకు ఈ రెండు మోడళ్లపై  ప్రత్యేకంగా రూ. 5,000 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను యమహా వర్తింప చేసింది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top