Xiaomi Mijia AR Glasses: 100 గ్రాముల కళ్ల జోడు..100 నిమిషాల వీడియోల్ని రికార్డ్‌ చేస్తుంది!

Xiaomi Has Announced Its First Mijia Ar Glasses Camera - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ షావోమీ టెక్నాలజీ విభాగంలో మరో అడుగు ముందుకు వేసింది. అగ్‌మెంటెడ్ రియాలిటీతో 'మిజియా ఏఆర్‌ గ్లాసెస్ కెమెరా '  స్మార్ట్‌ గ్లాస్‌ను విడుదల చేసింది. 

షావీమీ 'మిజియా ఏఆర్‌ స్మార్ట్‌  గ్లాస్‌ను చైనాలో విడుదల చేయగా.. గ్లోబల్‌ మార్కెట్‌లో ఎప్పుడు విడుదల చేస్తున్నారనే అంశంపై షావోమీ స్పందించింది. తాము విడుదల చేసిన ఈ ఏఆర్‌ స్మార్ట్‌ గ్లాస్‌ను భారత్‌ మార్కెట్‌లో త్వరలోనే అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఆ తర్వాత డిమాండ్‌ను బట్టి ఇతర దేశాల మార్కెట్లకు పరిచయం చేస్తామని పేర్కొంది. 

మిజియా ఏఆర్‌ గ్లాసెస్ ఫీచర్లు 
రూ.29,030 విలువైన మిజియా ఏఆర్‌ గ్లాసెస్‌లో డ్యుయల్‌ కెమెరా సెటప్‌, 50 మెగా పిక్సెల్‌ క్వాడ్ బేయర్ సెన్సార్లు, 8మెగా పిక్సెల్‌ పెరిస్కోపిక్‌ టెలిఫోటో కెమెరా, ఐఓఎస్‌ ఆప్టికల్‌ స్టెబిలైజేన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 5ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌ సపోర్ట్‌ చేస్తుండగా 15ఎక్స్‌ హైబ్రిడ్‌ వరకు జూమ్‌ చేసుకోవచ్చని షావోమీ ప్రతినిధులు వెల్లడించారు.  
 
పనితనం అంటే ఇదే మరి
కేవలం 100గ్రాముల బరువు ఉండే ఈ స్మార్ట్‌ గ్లాస్‌ పనితీరులో అమోఘమని షావోమీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ గ్లాస్‌లో ఉన్న కెమెరాలు ఫోటోల్ని తీయడం, షేర్‌ చేయడం సెకన్లలో జరిగిపోతాయని స్పష్టం చేసింది. ఈ గ్లాస్‌లో మరో ప్రత్యేకత ఏంటంటే 100 నిమిషాల వీడియో పుటేజీని నాన్‌ స్టాప్‌గా రికార్డ్‌ చేస్తుందని షావోమీ సీఈవో లీ జూన్ చెప్పారు. 

స్టోరేజీ ఎంతంటే 
స్నాప్‌ డ్రాగన్‌ 8చిప్‌ సెట్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ గ్లాస్‌లో 3జీబీ ర్యామ్‌ 32జీబీ స్టోరేజ్‌ సౌకర్యం ఉంది. 1,020 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 10డబ్ల్యూ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌, 30నిమిషాల్లో 80శాతం బ్యాటరీ ఛార్జింగ్‌ ఎక్కే సామర్ధ్యం ఉంది. 3,000 నిట్స్‌ పీక్స్‌ బ్రైట్‌నెస్‌తో ఓఎల్‌ఈడీ స్క్రీన్‌తో వస్తుండగా.. ఈ స్మార్ట్‌ గ్లాసెస్‌ డిజిటల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తాయని విడుదల సందర్భంగా షావోమీ వెల్లడించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top