ప్రపంచంలో వేగవంతమైన కారు ఇదే!.. లాంచ్ ఎప్పుడంటే? | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో వేగవంతమైన కారు ఇదే!.. లాంచ్ ఎప్పుడంటే?

Published Fri, Mar 1 2024 5:36 PM

World Fastest Car Tesla Roadster Coming Soon - Sakshi

అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారును లాంచ్ చేయడానికి సిద్ధమైపోయింది. టెస్లా రోడ్‌స్టర్ (Tesla Roadster) పేరుతో కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు 0 నుంచి 60 కిమీ/గం వేగాన్ని సెకను కంటే తక్కువ వ్యవధిలోనే చేరుకుంటుందని సమాచారం.

ఈ కారు గురించి టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్' (Elon Musk) కొన్ని వివరాలను వెల్లడిస్తూ.. ఇది 2024 చివరి నాటికి లేదా 2025 ప్రారంభంలో మార్కెట్లో లాంచ్ అవుతుందని పేర్కొన్నారు. ఈ కారుని టెస్లా, స్పేస్ఎక్స్ సహకారంతో తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.

టెస్లా లాంచ్ చేయనున్న ఈ కొత్త కారు అత్యంత ఆకర్షణీయమైన కారుగా పేర్కొన్నారు. ఈ కారు డిజైన్ మాత్రమే కాకుండా, ఫీచర్స్ కూడా చాలా వరకు అప్డేట్ పొందినట్లు తెలుస్తోంది. ఇది 4 సీట్లు కలిగిన ఎలక్ట్రిక్ కారు. దీని గురించి మస్క్ 2017లోనే వెల్లడించారు.

కంపెనీ టెస్లా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ కారు కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఈ కారును బుక్ చేసుకోవాలనుంటే 50000 డాలర్ల టోకెన్ మొత్తాన్ని వెచ్చించి బుక్ చేసుకోవచ్చు. నిజానికి 2021లో లాంచ్ కావలసిన ఈ కారు 2024 చివరి నాటికి లాంచ్ అవుతుందని చెబుతున్నారు.

ఇదీ చదవండి: భారత యాప్స్‌పై గూగుల్‌ కన్నెర్ర.. ప్లేస్టోర్‌లో అవి మాయం!

Advertisement
Advertisement