IndiaVsPakistan:యాంటీస్ట్రెస్ బాల్‌తో సిద్ధం, టీవీ మాత్రం ఆఫ్‌! ఆనంద్‌ మహీంద్ర 

Will only await news of the results in the evening tweets Anand Mahindra - Sakshi

సాక్షి,ముంబై: ఇండియా, పాకిస్తాన్‌,క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఆ క్రేజ్‌ మామూలుగా ఉండదు. సెలబ్రిటీస్‌ల దగ్గరినుంచి, సాధారణ క్రికెట్‌ ఫ్యాన్‌దాకా తీవ్ర ఉత్కంఠ నెలకొంటుంది.  తాజా టీ20 ప్రపంచకప్‌ పాక్‌, ఇండియా  మ్యాచ్‌పై  పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర మరోసారి తన ట్విట్‌తో వార్తల్లో నిలిచారు.

ఉత్కంఠ భరితమైన ఈ మ్యాచ్‌కోసం నేను సిద్ధం. యాంటీ-జిన్క్స్ స్ప్రే, యాంటీ-స్ట్రెస్ బాల్, వర్రీ బీడ్స్‌ని  సిద్ధంగా ఉంచుకున్నా. సాయంత్రం రానున్న ఫలితాలకోసం ఎదురు చూస్తా తప్ప...టీవీని చూడను ఆఫ్‌ చేసేశా.. అంటూ మ్యాచ్‌ ప్రారంభానికి ముందే ట్వీట్‌ చేశారు. స్టేడియం ఉత్కంఠపూరితంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన ఉద్యోగం టీమిండియా జట్టు సభ్యుడిగా ఉండటం అంటూ కోట్లాది మంది అభిమానులు అంచనాల మధ్య హై ఓల్టేజ్‌ మ్యాచ్‌లో గెలుపుకోసం ఆటగాళ్ల ఆరాటం, తపనపై మరో ట్వీట్‌ చేశారు. 

మ్యాచ్‌కు ముందు అభిమానుల లుంగీ డ్యాన్స్ వీడియోను కూడా షేర్‌ చేశారు. దీంతో ‘ఆనంద్ సార్, మీ హాస్యం అసాధారణమైనది, అయితే భారత క్రికెట్ జట్టును ఎంకరేజ్‌ చేసేందుకు ఈ మ్యాచ్‌ని తప్పక చూడాలి, తద్వారా  ఇండియా పాకిస్తాన్‌ను ఓడించి పాత ఓటమినుంచి బయటపడుతుంది’ అంటూ ఒక యూజర్‌ కామెంట్‌ చేయడం విశేషం. తాజాగా ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌ స్టేడియంలో టీ‍-20 వరల్డ్‌ కప్‌ 2022లో భారత్ వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌కు క్రికెట్‌ ప్రేమికులు  ఎంజాయ్‌ చేస్తున్నారు. 

టీమిండియా టార్గెట్ 160 (ఆదివారం, సాయంత్రం 3.30 నిమిషాలకు)
కాగా  తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న  పాక్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. తద్వారా భారత్‌కు 160 టార్గెట్‌ నిర్దేశించింది.  భారత ఆటగాళ్లు హార్దిక్, అర్ష్‌దీప్ చెరో 3 వికెట్లు తీయగా,  షమీ, భువీ   చెరొక వికెట్‌ పడగొట్టారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top