క్లబ్‌హౌస్ అంటే ఏమిటి? ఎందుకింత ఫేమస్

What Is Clubhouse In Telugu: Check Complete Details Of This Audio Chat App - Sakshi

ప్రపంచంలో టెక్నాలజీ రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతుంది. ఎక్కడో ఒక చోట రోజుకు ఒక కొత్త ఆవిష్కరణ జరుగుతుంది. ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌, ట్విటర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలలో అక్షరాలు, వీడియోల ద్వారా భావాలను పంచుకునే వాళ్లం కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పడు ఆడియోల రూపంలో కూడా మన భావాలను పంచుకోవచ్చు. అమెరికాకు చెందిన ఆల్ఫా ఎక్స్‌ప్లోరేషన్‌ కో సంస్థ ఆడియో ఓన్లీ సోషల్‌ ఫ్లాట్‌పాం ‘క్లబ్‌హౌస్‌’ను  రూపొందించింది. ఈ యాప్‌ మొదట ఆపిల్ ఐఓఎస్‌ యూజర్ల కోసం మార్చి 2020లో తీసుకొచ్చారు. కేవలం విడుదలైన ఒక ఏడాది కాలంలోనే బాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం క్లబ్‌హౌస్‌ ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులో ఉంది. క్లబ్‌ హౌస్‌లో 5 వేల మందితో చాట్‌ రూమ్‌ ఏర్పాటు చేసుకుని మాట్లాడుకునే ప్రత్యేకమైన ఫీచర్‌ ఉంది. 

క్లబ్‌హౌస్ అంటే ఏమిటి?
క్లబ్‌ హౌస్‌లో ఇతర సామాజిక మద్యమాలలో లాగా వ్రాతపూర్వక, వీడియోల ద్వారా పోస్టింగ్‌లు చేయలేము. దీనిలో కేవలం మనం లేదా ఇతరులు మాట్లాడే మాటలు మాత్రమే వినబడుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఒక రేడియో లాగా. కానీ, ఇందులో చర్చించుకునే అవకాశం ఉంది. ఇందులో ఆలోచనలు పంచుకోవడానికి ప్రభావవంతమైన వ్యక్తుల పోస్టింగులు వినడానికి భాగ ఉపయోగపడుతుంది.

క్లబ్‌హౌస్‌కు లాగిన్ అవ్వడం ఎలా?
ఇతర సోషల్ మీడియా యాప్స్ మాదిరిగా కాకుండా, క్లబ్‌హౌస్ చేరాలంటే కేవలం అందులో ఉన్న సభ్యులు ఆహ్వానిస్తేనే చేరే అవకాశం ఉంటుంది. మీ స్నేహితుడు ఆహ్వానిస్తే తప్ప అందులో చేరే అవకాశం తక్కువ. ఆహ్వానం లేకుండా ఫోన్ నంబర్‌తో నమోదు చేసుకోవాలనుకునే వారిని వెయిటింగ్ లిస్టులో ఉంటుంది. అతని వంతు వచ్చిన తర్వాత సభ్యుడిగా క్లబ్‌హౌస్‌కు లాగిన్ అవ్వవచ్చు.

క్లబ్‌హౌస్‌ను ఎలా ఉపయోగించాలి?
ఈ అప్లికేషన్‌లో చాలా రూమ్స్ ఉంటాయి. ఈ రూమ్స్ మాట్లాడటం ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ జరుగుతుంది. మీరు గదిలో మాట్లాడే వాటిని లేదా మోడరేటర్ అనుమతితో మాత్రమే వినగలరు. 

క్లబ్‌హౌస్ ఆహ్వాన కోడ్ అవసరమా?
క్లబ్‌హౌస్ యాప్ లో సభ్యత్వం పొందడానికి ఇప్పటికే ఈ యాప్ ఉపయోగిస్తున్న స్నేహితుడు మీకు ఆహ్వాన కోడ్‌ను పంపాలి. మీరు ఆహ్వాన కోడ్ లేకుండా ఇందులో జాయిన్ కాలేరు. 

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో క్లబ్‌హౌస్ అందుబాటులో ఉందా?
ఆహ్వాన వ్యవస్థతో పనిచేసే క్లబ్‌హౌస్ అనేది ఒక మొబైల్ యాప్. ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే వినియోగదారులకు ఆహ్వానిస్తుంది. ఇప్పటికీ ఇది ఇంకా అభివృద్ధిలో ఉంది. ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ యూజర్స్ కి అందుబాటులో ఉంది. ఇది మనకు నచ్చిన కంటెంట్ ఉచితంగా లభించడంతో పాటు సమాజంలో భాగ గుర్తింపు పొందిన వ్యక్తుల ఐడియాలను వినే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎలోన్ మస్క్, క్రిస్ రాక్, ఓప్రా విన్ఫ్రే, మార్క్ క్యూఫిన్ వంటి ప్రజాదరణ పొందిన ఉన్నత ప్రొఫైల్ వ్యక్తులు ఉన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top