సగటు ద్రవ్యోల్బణం 5 శాతం

Wall Street Brokerage Bank Of America Securities Has Pencilled In lower Than The Consensus - Sakshi

బ్యాంక్‌ అఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021– 22) భారత్‌లో ద్రవ్యోల్బణం సగటున 5 శాతం స్థాయిలో ఉండొచ్చంటూ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. కాకపోతే గత అంచనా 4.7 శాతం కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. జూన్‌ నెల గణాంకాలు భవిష్యత్తు అంచనాలకు కీలకమని పేర్కొంది.

మే నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.3 శాతం స్థాయిలో ఉండడంతో ఈ బ్రోకరేజీ సంస్థ 30 బేసిస్‌ పాయింట్ల మేర తన అంచనాలను పెంచింది. అంతర్జాతీయంగా అధిక చమురు ధరల రూపంలో రిస్క్‌ ఉంటుందని అభిప్రాయపడింది. జూన్‌ నెలకు సంబంధించి వినియోగ ధరల ఆధారిత సూచీ (రిటైల్‌ ద్రవ్యోల్బణం/సీపీఐ) గణాంకాలు ఈ నెల 12న విడుదల కానున్నాయి.

గత నెలకు సంబంధించి రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.5 శాతంగా ఉండొచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. కాకపోతే విశ్లేషకులు 6 శాతానికి పైనే నమోదు కావచ్చని భావిస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top