China: చైనాలో వేగంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి.. ఫోక్స్‌వ్యాగన్‌ కీలక నిర్ణయం

Volkswagen closed two units in China after Omicron Transmission - Sakshi

కరోనా విషయంలో బయటి ప్రపంచానికి చైనా చెప్పేదొకటి.. క్షేత్రస్థాయిలో జరిగేదొకటి. కరోనా వ్యాప్తి ఇప్పటికీ కం‍ట్రోల్‌లోనే ఉందంటూ చైనా చెబుతున్నా వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. చైనాలో కరోనా తీవ్రతను తెలిపే సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఫోక్స్‌ వ్యాగన్‌ తీసుకున్న నిర్ణయం కూడా వాటి సరసన చేరింది. 

చైనా యూనిట్లు
ప్రపంచలో అతి పెద్ద కార్ల తయారీ కంపెనీగా పేరుంది జర్మన్‌ కార​ మేకర్‌ ఫోక్స్‌ వ్యాగన్‌కి. ఈ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కార్ల తయారీ యూనిట్లు ఉన్నాయి. చైనాలోని టియాన్‌జిన్‌ నగరంలో  ఫోక్స్‌ వ్యాగన్‌ కంపెనీకి కార్‌ మాన్యుఫ్యాక​​​​​​‍్చరింగ్‌ యూనిట్‌తో పాటు కార్ల తయారీలో వినియోగించే విడిభాగాలు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. 

ప్రమాదకరంగా
ఒమిక్రాన్‌ వ్యాప్తి పెరిగినప్పటి నుంచి ఫ్యాక్టరీలో ఫోక్స్‌ వ్యాగన్‌ కంపెనీ కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఒక్కసారిగా చైనాలో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోవడంతో ఫోక్స్‌ వ్యాగన్‌ యాజమాన్యం ఆందోళన చెందింది. దానికి తగ్గట్టే ఫోక్స్‌వ్యాగన్‌ యూనిట్లలో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు కోవిడ్‌ బారిన పడ్డారు. బుధవారం నాటికి 30 మందికి కరోనా నిర్థారణ కాగా గురువారం మరో 41 మందిలో కోవిడ్‌ లక్షణాలు కనిపించాయి. 

కఠిన నిర్ణయం
ఊహించని వేగంతో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి చెందుతుండటంతో టియాన్‌జిన్‌ నగరంలో ఉన్న  కార్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌, కాంపోనెంట్‌ ఫ్యాక్టరీ రెండింటిని మూసేస్తున్నట్టు గురువారం ఫోక్స్‌వ్యాగన్‌  ప్రకటించింది. చైనాలోని తమ యూనిట్లలో కోవిడ్‌ ప్రవేశించింది. ఇప్పటికే కోవిడ్‌ లక్షణాలు ఉన్న యాభై మందికి పైగా శాంపిల్స్‌ ల్యాబ్‌కి పంపించాం. ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడి ప్లాంట్లలో కార్యకలాపాలు నిలిస్తున్నామని ఫోక్స్‌వ్యాగన్‌, చైనా ప్రతినిధి తెలిపారు.  ఔ

చదవండి: ఎక్కడ నుంచైనా పనిచేయండి..! తిరిగేందుకు రూ. లక్ష మేమిస్తాం..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top