వివో నుంచి మరో వై-సిరీస్‌ మొబైల్ | Vivo Y31 Launched in India with Triple Rear Cameras | Sakshi
Sakshi News home page

వివో నుంచి మరో వై-సిరీస్‌ మొబైల్

Jan 20 2021 8:38 PM | Updated on Jan 20 2021 9:10 PM

Vivo Y31 Launched in India with Triple Rear Cameras - Sakshi

మొబైల్ తయారీ సంస్థ వివో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ వివో వై31ను నేడు భారతదేశంలో విడుదల చేసింది. వివో వై-సిరీస్‌లో ఇప్పటికే మూడు ఫోన్లు విడుదలయ్యాయి. వివో వై31లో వాటర్ డ్రాప్ స్టైల్ డిస్ ప్లేను అందించారు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 600-సిరీస్ ప్రాసెసర్ ను అందించారు. ఇది ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. వివో వై31ఎస్ ఇటీవలే చైనాలో 5జీ సపోర్ట్‌తో లాంచ్ అయింది.(చదవండి: 

వివో వై31 ఫీచర్స్:
వివో వై31 ఒక మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. ఇది స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ ‌చేత పనిచేస్తుంది. ఇందులో 6జీబీ ర్యామ్, 128జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంది. ఇది 6.58-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ఐపిఎస్ డిస్‌ప్లేతో వస్తుంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్ నాచ్‌ను కలిగి ఉంది. వెనుక భాగంలో 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, డ్యూయల్ 2-మెగాపిక్సెల్ యూనిట్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11 మీద పనిచేస్తుంది. కనెక్టివిటీ కోసం 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టులు కూడా ఇందులో ఉన్నాయి. భారతదేశంలో వివో వై31 ధర రూ.16,490గా నిర్ణయించబడింది. అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, వివో ఇండియా ఇ-స్టోర్, ఇతర ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాల నుండి మీరు ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇది రేసింగ్ బ్లాక్, ఓషన్ బ్లూ అనే రెండు రంగులలో లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement