ఎక్స్ 60 ప్రోను లాంచ్ చేసిన వివో

Vivo X60, X60 Pro with Exynos 1080 Processor Launched - Sakshi

చైనా: వివో ఎక్స్ 60, ఎక్స్ 60 ప్రో ధరలు, ఫీచర్స్, అమ్మకపు తేదీలను అధికారికంగా సంస్థ ప్రకటించింది. స్నాప్‌డ్రాగన్ 888 ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ తో రాబోయే వివో ఎక్స్ 60 ప్రో ప్లస్ జనవరిలో లాంచ్ కానుంది. వివో ఎక్స్ 60, ఎక్స్ 60 ప్రో రెండూ శామ్‌సంగ్ ఎక్సినోస్ 1080 5జీ ప్రాసెసర్ తో రానున్న ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌లు ఇవి. వివో ఎక్స్ 60, ఎక్స్ 60 ప్రో 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో ఫుల్‌హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉన్నాయి. అయితే భారతదేశంలో వీటిని ఎప్పుడు తీసుకొస్తారో అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. 

వివో ఎక్స్ 60 ప్రో ఫీచర్స్:
వివో ఎక్స్ 60 ప్రో 6.56-అంగుళాల అమోలేడ్ డిస్‌ప్లేతో ఎఫ్‌హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానుంది. ఈ మొబైల్ 5నానోమీటర్ తయారు చేయబడిన ఎక్సినోస్ 1080 ప్రాసెసర్ తో పని చేయనుంది. ఇది 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఫోన్ సరికొత్త ఆరిజిన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో పని చేసే 4,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. వివో ఎక్స్ 60 ప్రోలో 48 ఎంపీ(ఎఫ్/1.48) సోనీ ఐఎమ్‌ఎక్స్ 598 ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 13 ఎంపీ 120-డిగ్రీల అల్ట్రా-వైడ్, 13ఎంపీ లెన్స్ పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. ఇది సెకండ్-జెన్ మైక్రో-గింబాల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజషన్ టెక్నాలజీతో వస్తుంది. వివో ఎక్స్ 60 ప్రోలో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 32ఎంపీ కెమెరా ఉంది. ఇందులో భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. కనెక్టివిటీ పరంగా వివో 60 ప్రోలో డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.1, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి, ఫేస్ అన్‌లాక్ ఉన్నాయి. వివో ఎక్స్ 60 ప్రో 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ ధర సీఎన్వై 4,498 (సుమారు రూ.50,500)కి లభిస్తుంది. ఈ మొబైల్ బ్లూ, బ్లాక్ రంగులలో లభిస్తుంది.

వివో ఎక్స్ 60 ఫీచర్స్:
వివో ఎక్స్ 60 ఫీచర్స్ ప్రో మోడల్ మాదిరిగానే ఉంటాయి. ఈ హ్యాండ్‌సెట్‌లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, ఎక్సినోస్ 1080 ప్రాసెసర్, 32ఎంపీ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్ ఓఎస్. వివో ఎక్స్ 60 4,200 ఎంఏహెచ్ బ్యాటరీతో నడుస్తుంది. చైనాలో వివో ఎక్స్ 60 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు ధర  సీఎన్‌వై 3,498 (సుమారు రూ.39,400), 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర  సీఎన్‌వై 3,798(సుమారు రూ.42,700), 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర సీఎన్‌వై 3,998(సుమారు రూ.45,000)కి లభిస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top