Vineet Khosla to join The Washington Post as CTO - Sakshi
Sakshi News home page

వాషింగ్టన్ పోస్ట్‌ సీటీవోగా వినీత్ ఖోస్లా

Jul 27 2023 8:32 PM | Updated on Jul 27 2023 8:52 PM

Vineet Khosla to join The Washington Post as CTO - Sakshi

అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ ది వాషింగ్టన్ పోస్ట్‌లో భారతీయ-అమెరికన్‌కు కీలక స్థానం దక్కింది. ఉబెర్, యాపిల్ మాజీ ఎగ్జిక్యూటివ్ వినీత్ ఖోస్లా జూలై 31 నుంచి వాషింగ్టన్ పోస్ట్‌లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా చేరనున్నారు. వాషింగ్టన్ పోస్ట్‌ సీటీవోగా వినీత్‌ ఖోస్లా సంస్థ సీఈవోకి సీనియర్ సలహాదారుగా వ్యవహరిస్తారు. ఇంజనీరింగ్ బృందానికి, ఆవిష్కరణ వ్యూహానికి నాయకత్వం వహిస్తారు. తద్వారా సంస్థ సాంకేతిక లక్ష్యాల కోసం తోడ్పాటు అందిస్తారు. 

మీడియా ప్రపంచం వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో ది వాషింగ్టన్‌ పోస్ట్‌కి వినీత్‌ను స్వాగతిస్తున్నందుకు సోంతోషిస్తున్నామని, వాషింగ్టన్‌ పోస్ట్‌ తాత్కాలిక సీఈవో పాటీ స్టోన్‌సిఫర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్‌తో సహా సాంకేతిక పరిజ్ఞానంలో వినీత్‌కు ఉన్న విస్తృత నేపథ్యం తమ తదుపరి దశ ఆవిష్కరణలకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. 

ఖోస్లాకు సాంకేతిక పరిశ్రమలో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. యాపిల్‌లో  సిరి సహజ భాషా ఇంజిన్ కోసం, ఉబెర్‌లో మ్యాప్స్ రౌటింగ్ టీమ్‌ కోసం ఆయన పనిచేశారు. జార్జియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మాస్టర్స్ పట్టా పొందిన వినీత్‌ ఖోస్లా 2005 నుంచి ఆయన కృత్రిమ మేధపై పని చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement