కోల్‌కతా సీపీగా మనోజ్‌ వర్మ | Manoj Kumar Verma made new commissioner of Kolkata Police, Vineet Goyal removed | Sakshi
Sakshi News home page

కోల్‌కతా సీపీగా మనోజ్‌ వర్మ

Sep 18 2024 5:11 AM | Updated on Sep 18 2024 5:11 AM

Manoj Kumar Verma made new commissioner of Kolkata Police, Vineet Goyal removed

వైద్య విద్య, వైద్య సేవల డైరెక్టర్ల తొలగింపు 

కోల్‌కతా: జూనియర్‌ డాక్లర్లు డిమాండ్‌ చేసినట్లుగానే కోల్‌కతా పోలీసు కమిషనర్‌ వినీత్‌ గోయల్‌పై వేటు పడింది. కొత్త కమిషనర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ కుమార్‌ వర్మను బెంగాల్‌ ప్రభుత్వం మంగళవారం నియమించింది. జూడాలకు ఇచి్చన హామీ మేరకు ఆరోగ్య సేవల డైరెక్టర్‌ దెవాశిష్‌ హల్దర్, వైద్య విద్య డైరెక్టర్‌ కౌస్తవ్‌ నాయక్‌లను మమత సర్కారు తొలగించింది. 

కోల్‌కతా నార్త్‌ డివిజన్‌ డిప్యూటీ పోలీసు కమిషనర్‌ అభిõÙక్‌ గుప్తా పైనా వేటు వేసింది. మనోజ్‌ వర్మ జంగల్‌మహల్‌ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతలో కీలకపాత్ర పోషించారు. కిషన్‌జీ (కోటేశ్వర రావు) ఎన్‌కౌంటర్‌లోనూ ముఖ్యభూమిక వహించారు. ఆర్‌.జి.కర్‌ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటనను నిరసిస్తూ బెంగాల్‌లో జూనియర్‌ డాక్టర్లు 39 రోజులుగా విధులను బహిష్కరిస్తున్నారు. సోమవారం రాత్రి మమతతో సమావేశమయ్యారు. వారి ప్రధాన డిమాండ్లను మమత అంగీకరించడం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement