ప్రభుత్వ వాహనాలకూ స్క్రాపేజీ పాలసీ 

Vehicles Scrappage Policy Over 15 Years Older Government - Sakshi

15 ఏళ్లు పైబడిన వాటికి వర్తింపు 

2022 ఏప్రిల్‌ 1 నుంచి అమలు 

న్యూఢిల్లీ: ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు (పీఎస్‌యూ) చెందిన వాహనాలు 15 ఏళ్లు పైబడిన పక్షంలో వాటికి కూడా స్క్రాపేజీ (తుక్కు) విధానాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2022 ఏప్రిల్‌ 1 నుంచి దీన్ని అమలు చేయనుంది. దీనిపై త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉందని రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ దీనికి ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. పర్యావరణ అనుకూల విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 15 ఏళ్లు పైబడిన  వాహనాలకు స్క్రాపేజీ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా మోటార్‌ వాహనాల చట్టానికి సవరణలను 2019లో ప్రభుత్వం ప్రతిపాదించింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top