ఆల్‌టైమ్‌ రికార్డ్: ఒక్క రోజులో 70 కోట్లు.. | UPI Sets New Record with over 70 Crore Transactions in A Single Day | Sakshi
Sakshi News home page

ఆల్‌టైమ్‌ రికార్డ్: ఒక్క రోజులో 70 కోట్లు..

Aug 5 2025 6:34 PM | Updated on Aug 5 2025 6:50 PM

UPI Sets New Record with over 70 Crore Transactions in A Single Day

డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చిన తరువాత చిన్న బట్టీ కొట్టు దగ్గర నుంచి, పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ వరకు.. దాదాపు అన్నీ ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్ జరిగిపోతున్నాయి. ఇటీవలే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) భారతదేశంలో ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. 2025 ఆగస్టు 2న ఒకే రోజులో ఏకంగా 70 కోట్ల కంటే ఎక్కువ లావాదేవీలను నమోదు చేసింది.

గత కొన్ని సంవత్సరాలుగా UPI చాలా వేగంగా ముందుకు సాగుతోంది. 2023 నుంచి దాని రోజువారీ వినియోగాన్ని రెట్టింపు చేసింది. అప్పట్లో, ఇది రోజుకు దాదాపు 35 కోట్లు లావాదేవీలను నిర్వహించేది. ఆ సంఖ్య ఆగస్టు 2024 నాటికి 50 కోట్లకు చేరింది. కాగా ఇప్పుడు తాజాగా ఇది 70 కోట్ల మైలురాయిని చేరుకుంది. అయితే వచ్చే ఏడాది నాటికి 100 కోట్ల లావాదేవీలను చేరుకోవాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement