Union Budget 2023: నిర్మలమ్మ ప్రధానంగా ఫోకస్‌ పెట్టే అంశాలు ఇవేనా!

Union Budget 2023: What To Expect From FM Nirmala Sitharaman, Key Sectors Focus - Sakshi

Union Budget 2023: ఎట్టకేలకు దేశ ప్రజలు ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్‌ 2023ను ప్రవేశపెట్టాల్సిన సమయం రానే వచ్చింది. ఈ రోజు (ఫిబ్రవరి 1 ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కోటి ఆశలతో ఎదురుచూస్తున్న బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది జనాకర్షన బడ్జెట్‌ ఉంటుందని భావిస్తున్నారు.

ఇక కేటాయింపులు విషయానికొస్తే.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆకట్టుకునేలా ఉంటాయని తెలుస్తోంది. వీటితో పాటు సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసే అవకాశమూ ఉంది.  కోవిడ్‌ తర్వాత నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ప్రజలు ఖర్చు కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. అయితే ఆదాయపు పన్ను స్లాబు విషయంలో గత 9 ఏళ్లుగా మార్పులు లేకుండా అలానే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వేతన జీవులను నిర్మలమ్మా కరుణిస్తుందనే అంటున్నారు. కాకపోతే ఈసారి కూడా భారీ వెసులుబాటు ఉండకపోవచ్చు కానీ.. కొద్దో గొప్పో మార్పులు ఉండే అవకాశం ఉందని వాదన వినిపిస్తోంది. 

ప్రస్తుతం కనీస మినహాయింపు పరిమితిని రూ.5లక్షలకు పెంచాలన్నా ఉద్యోగుల నుంచి డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది.  మధ్యతరగతిని ఆకట్టుకోవటానికి.. ముఖ్యంగా తయారీ మౌలిక సదుపాయల రంగాల్లో భారీగా ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యమిచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల కొలువుల కోతలు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ క్రమంలో పట్టణ ఉపాధి కల్పన పథకానికి శ్రీకారం చుట్టే ప్రతిపాదనలు ఉన్నాయంటూన్నారు. వీటితో పాటుగా గృహరుణాలు. ఆరోగ్య ఖర్చులపై పన్నుల్లో కాసింత వెసలుబాటు కల్పించే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు అధిక నిధులు కేటాయించాల్సిన అవశ్యకత కనిపిస్తోంది. రైల్వే శాఖకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. రైతులకు పెట్టుబడి సాయం పెంపు ఉండచ్చని తెలుస్తోంది. ఇక బంగారం దిగుమతులపై పన్ను తగ్గించడంతో పాటు ఎలక్ట్రానిక్‌ వస్తువులపై దిగుమతి సుంకం పెంచే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

01-02-2023
Feb 01, 2023, 10:57 IST
న్యూఢిల్లీ:   కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  మరికొద్ది క్షణాల్లో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఇప్పటికే  ప్రధానమంత్రి అధ్యక్షతన  సమావేశమైన  క్యాబినెట్‌...
01-02-2023
Feb 01, 2023, 10:53 IST
వచ్చే ఏడాదిలో ఎన్నికలు. కాబట్టి, ఇదే చివరి బడ్జెట్‌. పేదమధ్యధనిక వర్గాలు ఎన్నో అంచనాలు.. 
01-02-2023
Feb 01, 2023, 10:42 IST
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఈరోజు (ఫిబ్రవరి 1న) కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది. దేశమంతా ఆమె ప్రసంగం, కేటాయింపులు,...
01-02-2023
Feb 01, 2023, 10:19 IST
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 512 పాయింట్లు ఎగియగా నిఫ్టీ 140 పాయింట్లు లాభంతో కొనసాగుతోంది. ...
01-02-2023
Feb 01, 2023, 10:06 IST
‘బడ్జెట్‌ అంటే అంకెల వరుస కాదు. అంతకంటే ఎక్కువ. మన జీవితంతో ముడిపడి ఉన్న విషయం’  ‘బడ్జెట్‌ నవ్విస్తూనే ఏడిపిస్తుంది. ఏడిపిస్తూనే...
01-02-2023
Feb 01, 2023, 09:59 IST
రాజంపేట: పార్లమెంట్‌లో నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను  ప్రవేశపెట్టనున్నారు. ఏటా ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో ఉమ్మడి వైఎస్సార్‌...
01-02-2023
Feb 01, 2023, 08:36 IST
ఊరటలు, ఊరడింపులు, ఉపశమనాల కోసం ఉద్యోగులు మొదలుకుని ఆర్థిక నిపుణులు, పరిశ్రమ వర్గాల దాకా అందరూ ఏటా ఎదురు చూసే...
01-02-2023
Feb 01, 2023, 07:54 IST
ముంబై: ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో స్టాక్‌ మంగళవారం సూచీలు స్వల్ప లాభాలతో గటెక్కాయి. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ లోక్‌సభలో 2022–23 ఆర్థిక సర్వే...
01-02-2023
Feb 01, 2023, 07:33 IST
న్యూఢిల్లీ: ఆర్థిక సర్వే 2023ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన మంగళవారం...
01-02-2023
Feb 01, 2023, 05:10 IST
సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన గాయాలతోపాటు కోవిడ్‌ మహమ్మారి విసిరిన సంక్షోభంతో రాష్ట్రం ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో...
01-02-2023
Feb 01, 2023, 04:27 IST
సాక్షి, అమరావతి: విభజన చట్టం ప్రకారం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత మొత్తం కేంద్రానిదే....
01-02-2023
Feb 01, 2023, 03:40 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులు ఎలా ఉంటాయోననే దానిపై తెలంగాణ ప్రభుత్వ...
01-02-2023
Feb 01, 2023, 03:28 IST
నేడు దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో 2023–24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్నారు. దేశంలో నెలకొని...
31-01-2023
Jan 31, 2023, 17:31 IST
సాక్షి, హైదరాబాద్‌: మరో రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్‌పై అన్ని వర్గాలు గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. ఎన్నికలకు...
31-01-2023
Jan 31, 2023, 17:01 IST
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023ని  రేపు (ఫిబ్రవరి 1న) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో సమర్పించనున్నారు. మంగళవారం ప్రారంభమైన బడ్జెట్‌...
31-01-2023
Jan 31, 2023, 02:03 IST
సాక్షి, అమరావతి: కేంద్రప్రభుత్వ బడ్జెట్‌ రైలు ఈసారైనా రాష్ట్రంలో ఆగుతుందా.. దీర్ఘకాలిక రైల్వే ప్రాజెక్టులను గమ్యస్థానానికి చేరుస్తుందా.. కేంద్ర ఆర్థికమంత్రి...
30-01-2023
Jan 30, 2023, 18:53 IST
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధఙంచిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. అటు రానున్న ఎన్నికలు,...
30-01-2023
Jan 30, 2023, 16:28 IST
ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ని ఫిబ్రవరి నెలలో పార్లమెంట్‌లో ప్రవేశపెడుతోంది. అయితే గత కొన్నేళ్లుగా మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం...
30-01-2023
Jan 30, 2023, 16:27 IST
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ vs హిండెన్‌బర్గ్ రీసెర్చ్  వివాదం సెగ రానున్న బడ్జెట్‌ సెషన్‌ను భారీగానే తాగనుంది.  ప్రతి పక్షాల...
30-01-2023
Jan 30, 2023, 13:07 IST
నూతన వార్షిక బడ్జెట్‌లోనైనా ప్రధాని దేశంలో 60 కోట్లు పైబడి ఉన్న పేద, మధ్య తరగతి వర్గాలపై కనికరం చూపిస్తారా? ...



 

Read also in:
Back to Top