రష్యాకు మరో దిగ్గజ కంపెనీ భారీ షాక్..!

Ukraine Crisis: Qualcomm Stops Selling Products to Russian Companies - Sakshi

ఉక్రెయిన్ - రష్యా మధ్య ఇంకా దాడులు కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా దేశాలు రష్యా మీద అనేక ఆంక్షలు విధిస్తుంటే, ఫేస్బుక్, యూట్యూబ్, ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీలు ఆ దేశంలో తమ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. అయితే, తాజాగా మరో దిగ్గజ చిప్ మేకర్ కంపెనీ క్వాల్‌కామ్ అమెరికా విధించిన ఆంక్షలకు అనుగుణంగా రష్యన్ కంపెనీలకు తన ఉత్పత్తులను విక్రయించడం నిలిపివేసినట్లు తెలిపింది. క్వాల్‌కామ్ కంపెనీ సీనియర్ ప్రభుత్వ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ నేట్ టిబ్బిట్స్ ఈ నిర్ణయాన్ని ట్వీటర్ వేదికగా వెల్లడించారు.

"ఇది తప్పు. @Qualcomm ఉక్రెయిన్'లో దురాక్రమణ చేయకుండా శాంతియుతంగా పరిష్కారం కోసం ప్రయత్నించాలి. మేము ఉక్రేనియన్ ప్రజలకు మద్దతుగా అందించే విరాళం, తమ ఉద్యోగులు అందిస్తున్న విరాళాలకు సమానంగా ఉంటుంది. మేము అమెరికా చట్టాలు & ఆంక్షలను పాటిస్తున్నాము. రష్యన్ కంపెనీలకు మా కంపెనీ ఉత్పత్తులను విక్రయించడం లేదు" అని నేట్ టిబ్బిట్స్ అన్నారు. ఈ ట్వీట్'ని రిట్వీట్ చేస్తూ "మీ కంపెనీ @Qualcomm ఉత్పత్తులను రష్యాకు విక్రయించనందుకు ధన్యవాదాలు. @NateTibbits మాకు సహాయం అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. క్వాల్‌కామ్ సహాయం చేయాలనుకుంటే ఉక్రేనియన్ రక్షకుల కోసం శాటిలైట్ ఫోన్లను పంపవచ్చు. దీని వల్ల సైనికులు సమాచార బదిలీ వేగంగా చేసుకునే అవకాశం ఉంటుంది." అని ఫెడోరోవ్ అన్నారు.

(చదవండి: రూ.2కే లీటర్ పెట్రోల్.. ఏ దేశంలో తెలుసా?)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top