Oil Prices At A Record: Per Litre Petrol Price In India Vs Major Countries - Sakshi
Sakshi News home page

రూ.2కే లీటర్ పెట్రోల్.. ఏ దేశంలో తెలుసా?

Mar 18 2022 3:17 PM | Updated on Mar 18 2022 8:26 PM

Oil prices At a Record: Per litre petrol price in India vs major countries - Sakshi

ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా దాడులు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. ఉక్రెయిన్ పరిణామాలతో భారత్‌లోనూ ధరాఘాతం నెలకొంటోంది. పలు నిత్యవసరాలు, ఇతర వస్తువల ధరలు రోజురోజుకూ పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యారేల్ చమరు ధర 130 డాలర్లకు చేరుకుంది. దీంతో చాలా దేశాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మన దేశంలో కూడా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలతో పోల్చితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరగాల్సి ఉంది. 

కానీ, ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు జీవనకాల గరిష్టానికి చేరుకోవడంతో ఆయిల్ ధరల విషయంలో ఆయిల్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నాయి. హోలీ పండుగ తర్వాత ఏ క్షణమైనా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందన్న ప్రచారం రెండ్రోజుల క్రితం నుంచి జరుగుతోంది. అయితే పెట్రో ధరల విషయంలో గుడ్ న్యూస్ అందుతోంది. పెట్రో ధరలు త్వరలో తగ్గే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు భారీగా ముడిచమురును ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. భారత్‌కు తక్కువ ధరకే ముడిచమురు ఇస్తామని ఇప్పటికే రష్యా బంపర్ ఆఫర్ ప్రకటించడంతో వచ్చే కాలంలో ఇంధన ధరలు తగ్గనున్నట్లు సమాచారం. అయితే, మన దేశంలో పెట్రోల్ ధరలు రూ.100కి పైగా ఉంటే, ఇతర దేశాలలో పెట్రోల్ ధరలు ఎంతగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

దక్షిణాసియాలో పెట్రోల్ ధరలు:
మన దాయాది దేశం అయిన పాకిస్తాన్'లో ఒక లీటర్ పెట్రోల్ ధర 0.837 డాలర్లు(సుమారు రూ.63.43) ఉండగా, శ్రీలంకలో ఇది 1.111 డాలర్లు(రూ. 84) వద్ద ఉంది. బంగ్లాదేశ్ దేశంలో వాహనదారులు ప్రతి లీటర్ ఇంధనానికి $1.035(రూ.78.43) చెల్లిస్తూ ఉంటే, నేపాల్'లో ఉన్నవారు $1.226(రూ.93) చెల్లిస్తున్నారు. మన చుట్టూ పక్క దేశాలతో పోలిస్తే మన దేశంలోనే చమరు ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

లీటర్ పెట్రోల్ చౌకగా దొరికే దేశాలు: 
ఇతర దేశాలలో పోలిస్తే ప్రపంచంలోనే పెట్రోల్ ధర తక్కువగా ఉన్న దేశం "వెనిజులా". ఈ దేశంలో ఒక లీటర్ పెట్రోల్ $0.025(రూ.1.89)గా ఉంది. ఆ తర్వాత లిబియాలో ఇంధనం చౌకగా ఉంది. ఇక్కడ ఒక లీటర్ పెట్రోల్ ధర $0.032(రూ.2.43)గా ఉంది. 

పెట్రోల్ ధర ఎక్కువగా ఉన్న దేశాలు:
ఇతర దేశాలలో పోలిస్తే ప్రపంచంలోనే పెట్రోల్ ధర ఎక్కువగా ఉన్న దేశం "హాంగ్ కాంగ్". ఈ దేశంలో ఒక లీటర్ పెట్రోల్ $2.879(రూ.218)గా ఉంది. ఆ తర్వాత లిబియాలో ఇంధనం చౌకగా ఉంది. ఆ తర్వాత నార్వే, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, లిచెన్ స్టెయిన్, జర్మనీ వంటి దేశాలలో ఇంధనం ధర లీటరుకు రూ.200కు పైగా ఉంది.

(చదవండి: దేశ చరిత్రలో ఇదే తొలిసారి! కరోనా ఉన్నా..అదరగొట్టిన పన్నువసూళ్లు, ఏకంగా!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement