Uber India Chief: క్యాబ్​ డ్రైవర్​గా మారిన దిగ్గజ కంపెనీ సీఈఓ.. ఎందుకో తెలుసా?

Uber India Chief Prabhjeet Singh Ferries Passengers in Delhi NCR - Sakshi

ఇప్పుడిప్పుడే వర్క్​ ఫ్రం ఆఫీస్​ హడావుడి మొదలవుతుంది. రెండేళ్ల తర్వాత మళ్లీ ఉరుకుల పరుగుల జీవితం తిరిగొచ్చింది. క్యాబ్​ దొరుకుతుందా? లేదా? దొరికితే సమయానికి ఆఫీసుకు వెళతామా? అన్న సందేహాలతో గుండెల్లో అలజడి మళ్లీ మొదలయ్యింది. ఈ పరిస్థితుల్లో.. క్యాబ్​ ఎక్కిన తర్వాత.. డ్రైవర్​ ఓ దిగ్గజ కంపెనీకి సీఈఓ అని తెలిస్తే?వెంటనే మీరు ఏమి ఆలోచిస్తారు. ఈ కథనం చదువుతున్నవారు మొదట అలాంటి సంఘటనలు చోటు చేసుకోవాలి కదా అని ఆలోచిస్తారు. కానీ, ఇటీవల అనుభవమే న్యూఢిల్లీ​ ప్రజలకు ఎదురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉబెర్​ ఇండియా, దక్షిణాసియా సీఈఓ ప్రభజీత్​ సింగ్ సంస్థ చేపట్టిన ఓ పరిశోధనలో భాగంగా​ ఇటీవలే కొన్ని గంటల పాటు డ్రైవర్​ అవతారం ఎత్తారు. 

సాధారణ క్యాబ్ డ్రైవర్ లాగానే ఢిల్లీ వీధుల్లో ప్రయాణికులను ఎక్కించుకున్నారు. వారితో కొంతసేపు ముచ్చటించి గమ్యస్థానాలకు చేర్చారు. ఈ విషయాలను క్యాబ్​లో ఎక్కిన ప్రయాణికులు తమ సామాజిక మాధ్యమాల్లో వెల్లిడించారు. అనన్యా ద్వివేదీ(లింక్​డిన్​ యూజర్) ఈ విషయంపై తన అనుభవాలను పంచుకుంది. "చాలా రోజుల తర్వాత వర్క్​ ఫ్రం ఆఫీస్​ కోసం బయటకొచ్చి నేను క్యాబ్​ బుక్​ చేశాను. డ్రైవర్​ ఎవరో తెలుసా? ఉబెర్​ ఇండియా బాస్​.. ప్రభజీత్​ సింగ్​! ఓ రీసెర్చ్'లో భాగంగా​డ్రైవర్​గా మారారంటా. తొలుత నాకు ఏదో సదేహంగా అనిపించి ఆయన గురించి గూగుల్​ చేశాను. ఫొటోలు చూసిన తర్వాతే నేను నమ్మాను. ఇది నిజమే!. సమస్యలను అర్థం చేసుకునేందుకు.. ఇలా డ్రైవర్​ అవతారం ఎత్తడమనేది చాలా గొప్ప విషయం" అని ఆమె రాసుకొచ్చింది.

మరో లింక్​డిన్​ యూజర్ సౌరభ్ కుమార్ వర్మ కూడా ఉబెర్ ఇండియా సీఈఓపై ప్రశంసలు కురిపించారు. ప్రభజీత్​ సింగ్ ఉబెర్ సంస్థ సేవలను మరింత మెరుగుపరించేందుకు పరిశోధనలో భాగంగా డ్రైవర్​ అవతారం ఎత్తారు. "ఓ పెద్ద కంపెనీకి సీఈఓ మన క్యాబ్​ డ్రైవర్​గా మారితే మనకు ఎంతో విలువనిస్తున్నట్టే కదా! మనం మరింత భద్రంగా ఉన్నట్టే కదా. ప్రయాణికులను మరింతగా అర్థంచేసుకునేందుకు ప్రభజీత్​ సింగ్​ ప్రయత్నిస్తున్నారు. అందుకే వారితో మాట్లాడుతున్నారు. వారిని పిక్​ చేసుకుని, కావాల్సిన చోట దింపుతున్నారు. కుడోస్​" అని అన్నారు. ఇలా చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఈ అనుభవాన్ని షేర్ చేసుకున్నారు.

(చదవండి: Gold Demand: తగ్గేదే లే.. భారత్‌లో పసిడికి తగ్గని డిమాండ్..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top