అవును 'నేను ఏలియన్‌ని' : ఎలోన్ మస్క్

Twitter User Asks if Elon Musk Is an Alien, See His Hilarious Reply - Sakshi

ఎలోన్ మస్క్ అంటే తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు. హాలీవుడ్‌ మార్వెల్‌ సూపర్‌ క్యారెక్టర్‌ ఐరన్‌ మ్యాన్‌తో ఎలోన్ మస్క ను పోల్చుతారు. అలాగే, ఎలోన్ మస్క్ కూడా ఎప్పుడు కూడా తన అభిమానులతో దగ్గరగా ఎప్పుడూ ముందు ఉంటారు. క్రిప్టోకరెన్సీ, టెస్లా నుంచి రాకెట్లు, స్పేస్ ఎక్స్ వరకు బిలియనీర్ ఎలోన్ మస్క్ ట్విటర్ లో అడిగిన ప్రశ్నలకు సాధ్యమైనంత మేరకు సమాధానాలు ఇస్తారు. అంతే కాదు, అతను తన అభిమానులను స్టంప్ చేయడానికి చమత్కారమైన మీమ్స్ పోస్ట్ చేస్తాడు. అయితే, రెండు రోజుల క్రితం ఆగస్టు 28న ఒక యూజర్ మస్క్ నటించిన ఒక చిన్న వీడియో క్లిప్ పోస్ట్ చేశాడు. 

ఈ 17 సెకన్ల వీడియోలో టెస్లా సీఈఓ భౌతిక శాస్త్రం, తత్వశాస్త్రం, గ్రహాంతరవాసుల గురించి మాట్లాడుతారు. భౌతిక శాస్త్రం, తత్వశాస్త్రంలో గొప్ప ప్రశ్నలలో ఇది ఒకటి అని తాను భావిస్తున్నానని మస్క్ వీడియోలో చెప్పాడు. "గ్రహాంతరవాసులు ఎక్కడ ఉన్నారు?" ఈ ప్రశ్న తర్వాత అతను "బహుశా వారు మా మధ్య ఉండవచ్చు, నాకు తెలియదు" అని జోకులు వేస్తాడు, "కొంతమంది నేను గ్రహాంతరవాసిని అని అనుకుంటారు, కానీ అది నిజం కాదు" అని అంటారు. అయితే ఇప్పుడు ఆ వీడియో ట్రెండ్ అవుతుంది.  ఒక యూజర్ (@teslaownersSV) ఈ వీడియోను ట్వీట్ చేసి "@elonmusk గ్రహాంతరవాసినా?" అని అడిగాడు. అయితే, దీనికి మస్క్ ప్రతిస్పందనగా "నిజమే" అవును అని పేర్కొంటారు. 60 వేల మందికి పైగా యూజర్లు ఈ పోస్టును లైక్ చేశారు. మరికొందరు తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ రి-ట్వీట్  చేశారు.(చదవండి: ఫోన్‌ పోతే ఇలా తేలికగా కనిపెట్టొచ్చని తెలుసా?)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top