ఫోన్‌ పోయినా.. కనిపించకుండా పోయినా ఈ ఆప్షన్‌తో కనిపెట్టొచ్చు, డేటా ఎరేజ్‌ చేయొచ్చు

How To Track Lost Phone Using Google Find My Location - Sakshi

Trace Lost Android Phone Method:  పడుకున్నా.. మెలకువతో ఉన్నా పక్కన స్మార్ట్‌ ఫోన్‌ కనిపించకుండా పోతే గుండె ఆగినంతగా ఫీలయిపోతుంటారు చాలామంది. ఒకవేళ నిజంగా ఫోన్‌ పోతే.. ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతుంటారు. అలాంటి టైంలో వేరే డివైజ్‌ నుంచి ఫోన్‌ను కనిపెట్టేందుకు సైతం ఆప్షన్స్‌ ఉన్నాయి.  

ఫోన్‌ ఆన్‌లో ఉండడం, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, జీపీఎస్‌ ఇవిగనుక ఆన్‌లో ఉంటే.. ‘ఫైండ్‌ మై డివైజ్‌’ యాప్‌, గూగుల్‌ అకౌంట్‌కు కనెక్ట్ అయ్యి ఉండడం.. ఇవన్నీ ఉండాలి. లేకుంటే పోయిన ఫోన్‌ను కనుగొనడం కష్టం అవుతుంది. గూగుల్‌ ఫైండ్‌ మై డివైజ్‌ ఫీచర్‌ ద్వారా ఎలా కనిపెట్టాలో చూద్దాం ఇప్పుడు.

ముందుగా మరో డివైజ్‌ను తీసుకుని android.com/find లో గూగుల్‌ అకౌంట్‌తో (పోయిన ఫోన్‌లోని గూగుల్‌ అకౌంట్‌తోనే) లాగిన్‌ కావాలి. అప్పుడు ఆ రెండు ఫోన్లు ఒకే అకౌంట్‌కు లింక్‌ అయ్యి ఉంటాయి. కాబట్టి. ఫోన్‌ ఎక్కడుందనే ఆప్షన్‌ను ట్రేస్‌ చేసి లొకేషన్‌ను(సరైన లొకేషన్‌/లేదంటే ఆ దగ్గరి ప్రాంతంలో) గుర్తించడం తేలిక అవుతుంది. అయితే ఫోన్‌ ఉన్న లొకేషన్‌ చూపించినప్పుడు.. అక్కడికి ఒంటరిగా వెళ్లకపోవడం మంచిది. 
 

 గూగుల్‌ ఫైండ్‌ మై డివైజ్‌ ఫీచర్‌లో ‘ప్లే సౌండ్‌’ అనే ఆప్షన్‌ ఉంటుంది. ఫోన్‌ను ఎక్కడో పెట్టి మరిచిపోయినప్పుడు, లేదంటే ఫోన్‌ దొంగతనానికి గురై దగ్గర్లోనే ఉన్నప్పుడు గుర్తించడానికి ఈ ఫీచర్‌ సాయపడుతుంది. ఫోన్‌ కనిపెట్టిన ప్రాంతానికి వెళ్లినప్పుడు ఈ ఆప్షన్‌ను గనుక క్లిక్‌ చేస్తే.. ఫోన్‌ సైలెంట్‌ మోడ్‌లో ఉన్నా సరే ఐదు నిమిషాలపాటు ఏకధాటిన టోన్‌ మోగుతూనే ఉంటుంది. అప్పుడు ఫోన్‌ను కనిపెట్టుకోవచ్చు.
 

ఫోన్‌ దొంగతనం అవ్వాలనే గ్యారెంటీ ఏం ఉండదు. ఒక్కోసారి ఎక్కడో పెట్టి మరిచిపోవచ్చు కూడా. ఆ టైంలో ఫోన్‌ రిటర్న్‌ చేయాలనే ఉద్దేశం ఉన్నవాళ్ల కోసం ‘సెక్యూర్‌ డివైజ్‌’ ఆప్షన్‌ ఉంటుంది. దానిని గనుక క్లిక్‌ చేస్తే.. పోయిన ఫోన్‌ స్క్రీన్‌పై అవతలి వాళ్లకు ఓ మెసేజ్‌ పంపడానికి ఛాన్స్‌ వస్తుంది. అంతేకాదు ప్రత్యామ్నాయ నెంబర్‌ను కూడా వాళ్లకు పంపొచ్చు. అయితే ఈ ఆప్షన్‌, ఫోన్‌లోని డేటా సంరక్షణ కోసం ఫోన్‌ను లాక్‌ చేస్తుంది కూడా.
 

ఒకవేళ ఫోన్‌ను కనుక్కోవడం కష్టతరంగా మారిన టైంలో.. ఆ ఫోన్‌లోని డేటాను మొత్తం ఎరేజ్‌ చేయొచ్చు. అందుకోసం అదే పేజీలో ఉండే.. ‘ఎరేజ్‌ డివైజ్‌’.. బటన్‌ను క్లిక్‌ చేసి కన్ఫర్మ్‌ చేయాలి.  అప్పుడు ఇంటర్నల్‌ స్టోరేజ్‌లో ఉన్న డేటా మొత్తం డిలేట్‌ అయిపోతుంది. కానీ, ఎక్స్‌టర్నల్‌గా ఉన్న ఫోన్‌ డేటా మాత్రం అలాగే ఉండిపోతుంది.

క్లిక్‌ చేయండి: బుల్లెట్‌ బండి! పుట్టింది ఇలా..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top