Truecaller Removed Call Recording Feature Following New Google Rules - Sakshi
Sakshi News home page

Truecaller: గూగుల్‌ షాకింగ్‌ నిర్ణయం..ఇకపై ట్రూకాలర్‌లో ఈ ఫీచర్‌ పనిచేయదు..!

Published Sun, Apr 24 2022 8:52 AM

Truecaller Removes Call Recording Feature Following New Google Rule - Sakshi

ఆండ్రాయిడ్‌ యూజర్లకు ప్రైవసీను దెబ్బతీస్తున్నాయనే కారణంతో థర్డ్‌ పార్టీ కాల్‌ రికార్డింగ్స్‌ యాప్స్‌ను నిషేధిస్తున్నట్లు గూగుల్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కొత్త రూల్‌ను తెరపైకి రావడంతో కాలర్‌ వేరిఫికేషన్‌ ప్లాట్‌ఫాం ట్రూకాలర్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమ యాప్‌లో కాల్‌ రికార్డింగ్‌ ఫీచర్‌ను అందించబోమని ట్రూకాలర్‌ ప్రకటించింది. 

ఈ ఫీచర్‌ను మే 11 నుంచి నిలిపివేస్తామని ట్రూకాలర్‌ పేర్కొంది.  మే 11 నుంచి యాక్సెసిబిలిటీ ఏపీఐకి థర్డ్-పార్టీ అప్లికేషన్‌ల యాక్సెస్‌ని నియంత్రిస్తూ గూగుల్‌ ప్లే స్టోర్‌ పాలసీని అప్‌డేట్ చేసినట్లు గూగుల్‌ ప్రకటించిన వెంటనే ట్రూకాలర్‌ ఈ నిర్ణయం తీసుకుంది.  దీంతో థర్డ్‌ పార్టీ యాప్స్‌నుపయోగించి కాల్స్‌ను రికార్డింగ్‌ చేయలేరు.  ట్రూకాలర్‌ యాప్‌ యూజర్లకు కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను అందరికీ ఉచితంగా అందిస్తోంది, గూగుల్‌ యాక్సెసిబిలిటీ ఏపీఐని ఉపయోగించి కాల్‌ రికార్డింగ్‌ ఫీచర్‌ను ఎనేబుల్ చేసింది. అయితే, గూగుల్‌ అప్‌డేట్‌ చేసిన డెవలపర్ ప్రోగ్రామ్ విధానాల ప్రకారం...ఇకపై కాల్ రికార్డింగ్‌ను అందించలేమని ట్రూకాలర్‌ పేర్కొంది. 

ఇదిలా ఉండగా స్మార్ట్‌ఫోన్స్‌లో ముందుగా ఇన్‌స్టాల్‌ చేసిన యాప్స్‌తో, గూగుల్‌ డయలర్‌తో ఫోన్‌ కాల్స్‌ను రికార్డ్‌ చేయవచ్చునని గూగుల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు మరింత గోప్యతను అందించడానికి, కాల్ రికార్డింగ్ చట్టాలకు అనుగుణంగా గూగుల్‌ ఈ మార్పును తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

చదవండి: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు బిగ్‌ షాక్‌.. గూగుల్‌ కీలక నిర్ణయం

Advertisement

తప్పక చదవండి

Advertisement