Truecaller 12 Version Launched With Latest Features, Details Inside - Sakshi
Sakshi News home page

Truecaller Version 12 Features: 'ఘోస్ట్‌’ ఫీచర్లతో ట్రూ కాలర్‌

Nov 27 2021 1:22 PM | Updated on Nov 27 2021 3:47 PM

True Caller Introduced New Features - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌ ట్రూకాలర్‌ కొత్త ఫీచర్లను భారత్‌లోని ఆన్‌డ్రాయిడ్‌ ఫోన్‌ యూజర్లకు త్వరలో జోడిస్తోంది. వర్షన్‌–12లో భాగంగా వీడియో కాలర్‌ ఐడీ, కాల్‌ రికార్డింగ్‌ వీటిలో ఉన్నాయి. అలాగే ప్రీమియం చందాదార్ల కోసం ఘోస్ట్‌ కాల్, అనౌన్స్‌ కాల్‌ ఫీచర్లు సైతం అందుబాటులో ఉన్నాయి.

వీడియో కాలర్‌ ఐడీ కోసం యూజర్లు షార్ట్‌ వీడియోను యాప్‌నకు పొందుపర్చాల్సి ఉంటుంది. సొంతంగా వీడియో తీసుకోవడం లేదా బిల్ట్‌ ఇన్‌ టెంప్లేట్స్‌ వాడుకోవచ్చు. యూజర్లు తమకు నచ్చిన ఫోటో, నంబర్, పేరుతో ఘోస్ట్‌ కాల్‌ చేయవచ్చు. కాల్‌ చేసే వారి పేరు వినపడేలా కాల్‌ అనౌన్స్‌ ఫీచర్‌ దోహదం చేస్తుంది.   
 

చదవండి:  ట్రూకాలర్‌లో ఒకేసారి 8 మందితో కాన్ఫరెన్స్‌ కాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement