ఐటీలో పరిశోధనలకు ప్రోత్సాహంపై ట్రాయ్‌ కసరత్తు | Trai releases consultation paper on encouraging telecom R and D | Sakshi
Sakshi News home page

ఐటీలో పరిశోధనలకు ప్రోత్సాహంపై ట్రాయ్‌ కసరత్తు

Published Sat, Sep 23 2023 5:14 AM | Last Updated on Sat, Sep 23 2023 5:14 AM

Trai releases consultation paper on encouraging telecom R and D - Sakshi

న్యూఢిల్లీ: టెలికం, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ రంగాల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించే మార్గాలను అన్వేíÙంచడంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పరిశ్రమ వర్గాలతో సంప్రదింపుల కోసం చర్చాపత్రాన్ని విడుదల చేసింది. ఐసీటీ రంగంలో ఆర్‌అండ్‌డీ కార్యకలాపాల కోసం ప్రస్తుతమున్న విధానం సరిపోతుందా లేక ప్రత్యేక ఏజెన్సీ ఏదైనా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా అనే విషయంపై అభిప్రాయాలను కోరింది.

అలాగే, ప్రైవేట్‌ రంగం ఆర్‌అండ్‌డీని చేపట్టేలా ప్రోత్సహించేందుకు ట్యాక్స్‌ మినహాయింపులు, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలు వంటి విధానాలు ఎంత వరకు ఉపయోగకరంగా ఉంటాయనేది తెలపాలని సూచించింది. దీనితో పాటు పలు ప్రశ్నలను చర్చాపత్రంలో ట్రాయ్‌ పొందుపర్చింది. వాటిల్లో కొన్ని..

► ఆర్‌అండ్‌డీ ప్రోగ్రామ్‌లకు తగినన్ని నిధులను, సకాలంలో మంజూరు చేసేందుకు పారదర్శకమైన విధానాన్ని అమలు చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవచ్చు?
► నవకల్పనల స్ఫూర్తిని పెంపొందించాలంటే రాష్ట్రాలకు ర్యాంకింగ్‌ విధానాన్ని అమలు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందా?
► భారత్‌లో పేటెంట్‌ ఫైలింగ్‌ వ్యయాలను తగ్గించాల్సిన అవసరం ఉందా? ఒకవేళ సమాధానం అవును అయితే, ఎలా చేయొచ్చు? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement