
పీఎస్‌యూ టెలికం దిగ్గజాలు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్, ఐటీఐలకు మద్దతుగా అత్యున్నత కమిటీ మార్గదర్శకాలకు తెరతీసింది. దీంతో వేలం లేకుండానే ఇతర ప్రభుత్వ రంగ కంపెనీలకు మిగులు భూమి, భవనాలను బదిలీ చేసేందుకు వీలు చిక్కనుంది. గత నెలలో సమావేశమైన సెక్రటరీల కమిటీ ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది.
టెలికం పీఎస్‌యూ సంస్థల ఆస్తులను సొంతం చేసుకోవాలనుకునే ఇతర ప్రభుత్వ రంగ కంపెనీలు సంబంధిత అనుమతులతోపాటు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్‌ను దాఖలు చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకునేందుకు ఆస్తుల సంకేత విలువలో 2 శాతం సొమ్మును డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఆయా ఆస్తుల మానిటైజేషన్‌కు సంబంధిత వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ వెలువడిన 90 రోజుల్లోగా వీటిని పూర్తి చేయవలసి ఉంటుంది.
ఇదీ చదవండి: విదేశీ విస్తరణలో హీరో మోటోకార్ప్
కేంద్ర ప్రభుత్వ సంస్థలకు తొలి ప్రాధాన్యతా హక్కును వినియోగించుకునే వీలుంటుంది. అయితే నోటిఫికేషన్ వెలువడిన 90 రోజుల తదుపరి ఇతర ప్రయివేట్ రంగ కంపెనీలకు ఆస్తులను విక్రయించే వెసులుబాటును బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్, ఐటీఐ పొందుతాయి.