ల్యాండ్‌లైన్‌ యూజర్లకు కొత్త నంబరింగ్‌ సిస్టం: ట్రాయ్‌ | Trai recommends new numbering system for landline users | Sakshi
Sakshi News home page

ల్యాండ్‌లైన్‌ యూజర్లకు కొత్త నంబరింగ్‌ సిస్టం: ట్రాయ్‌

Feb 7 2025 6:38 AM | Updated on Feb 7 2025 10:43 AM

Trai recommends new numbering system for landline users

న్యూఢిల్లీ: వినియోగంలో లేని ఫోన్‌ నంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌.. కేంద్రానికి సిఫార్సులు చేసింది. వీటి ప్రకారం కొత్త నంబర్‌ సిస్టం కోడ్‌ ఇకపై టెలికం సర్కిల్‌ లేదా రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. ల్యాండ్‌లైన్‌ యూజర్లు మరో ల్యాండ్‌లైన్‌ యూజరుకు కాల్‌ చేయాలంటే మొత్తం పది అంకెలు డయల్‌ చేయాల్సి వస్తుంది. 

ముందుగా సున్నాను, తర్వాత ఎస్‌టీడీ కోడ్, ఆ తర్వాత ఫోన్‌ నంబరును డయల్‌ చేయాల్సి ఉంటుంది. ఒకే ఎస్‌డీసీఏలో (షార్ట్‌ డిస్టెన్స్‌ చార్జింగ్‌ ఏరియా) లోకల్‌ కాల్‌ చేయాలన్నా ముందగా సున్నాను జోడించి, ఎస్‌డీసీఏ కోడ్, ఆతర్వాత యూజరు నంబరును డయల్‌ చేయాలి. కొత్త నంబరింగ్‌ విధానం వల్ల ప్రస్తుత యూజర్ల నంబర్లలో ఎలాంటి మార్పు ఉండదని ట్రాయ్‌ తెలిపింది. నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు టెలికం ఆపరేటర్లకు 6 నెలల వ్యవధినివ్వాలని టెలికం శాఖకు సూచించింది.    

Advertisement
 
Advertisement
Advertisement