టయోటా కారు.. రెండు లక్షల సేల్స్! | Toyota Innova HyCross Crosses 2 Lakh Sales Milestone in India | Sakshi
Sakshi News home page

టయోటా కారు.. రెండు లక్షల సేల్స్!

Apr 11 2026 7:03 PM | Updated on Apr 11 2026 7:10 PM

Toyota Innova HyCross Crosses 2 Lakh Sales Milestone in India

టయోటా కంపెనీకి చెందిన 'ఇన్నోవా హైక్రాస్' అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ విషయాన్ని టయోటా కిర్లోస్కర్ మోటార్ సంస్థ 2026 ఏప్రిల్ 9న ప్రకటించింది.

నవంబర్ 2022లో లాంచ్ అయిన ఇన్నోవా హైక్రాస్ భారతదేశంలో రెండు లక్షల అమ్మకాలను పొందింది. కొత్త డిజైన్, లేటెస్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ వంటివాటితో భారతీయ కొనుగోలుదారులను ఈ కారు చాలా వేగంగా ఆకట్టుకుంది. న్యూ గ్లోబల్ ఆర్కిటెక్చర్ (TNGA) ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన ఇన్నోవా హైక్రాస్, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ మోటార్‌తో జతచేసే స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది 186 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

రూ. 19.53 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద ప్రారంభమయ్యే ఈ కారు.. భారత్ NCAP కింద 5-స్టార్ భద్రతా రేటింగ్‌ను కూడా పొందింది. కాబట్టి ఇది అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది.

ఇన్నోవా హైక్రాస్ రెండవ వరుసలో పవర్డ్ ఒట్టోమాన్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి వాటితో పాటు.. 65కు పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు వంటివి ఉన్నాయి. రహదారిపై భద్రతను, డ్రైవర్ అనుభూతిని మెరుగుపరచడానికి రూపొందించిన అధునాతన డ్రైవర్ సహాయక సూట్ అయిన టయోటా సేఫ్టీ సెన్స్‌ను కూడా ఇది కలిగి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement