చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ - రూ.10 వేలు కంటే తక్కువే!

Top Smartphones Under Rs 10000  - Sakshi

ఇప్పటికే పండుగ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ సమయంలో ఓ కొత్త మొబైల్ తక్కువ ధరలో కొనుగోలు చేస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటుంటారు. అలాంటి వారికోసం రూ. 10వేలు లోపు లభించే ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లను ఈ కథనంలో చూసేద్దాం.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 రూ. 10 కంటే ధరలో లభించే స్మార్ట్‌ఫోన్‌. ఇది 6.6-అంగుళాల HD+ డిస్ప్లే కలిగి, 13 మెగా ఫిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్, 5000 mAh బ్యాటరీ పొందుతుంది. ఈ మొబైల్  MediaTek Helio A20 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.

రెడ్‌మీ 12
మన జాబితాలో తక్కువ ధరకు లభ్యమయ్యే స్మార్ట్‌ఫోన్‌ల రెడ్‌మి 12 ఒకటి. ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా, పెద్ద సెన్సార్, అధునాతన పిక్సెల్-బిన్నింగ్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి. 2022 డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ మొబైల్ MediaTek Helio G85 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఇదీ చదవండి: డ్రైవర్‌కు రూ.9000 కోట్లు ట్రాన్స్‌ఫర్ - బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా

శాంసంగ్ గేలక్సీ ఎమ్13
బ్యాంక్ ఆఫర్లతో పనిలేకుండానే తక్కువ ధరకు మొబైల్ కొనాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది. అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ ధృడమైన ప్లాస్టిక్ బాడీ మరియు ట్రిపుల్-కెమెరా సెటప్, ఎక్సినోస్ ప్రాసెసర్ పొందుతుంది.

రియల్‌మి Narzo 50i
రియల్‌మీ Narzo 50i మంచి కలర్ ఆప్షన్స్‌లో లభించే బెస్ట్ మొబైల్. ఇది Unisoc T612 ప్రాసెసర్ కలిగి 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెమరా సిస్టం కూడా బాగానే ఉంటుంది. ఈ మొబైల్ ధర కూడా రూ. 10,000 కంటే తక్కువ.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top