Top Car News of The Week: మారుతి బ్రెజ్జా సిఎన్‌జి నుంచి టయోటా హైలెక్స్ వరకు..

Top car news of the week details in telugu - Sakshi

భారతదేశం ఆటోమొబైల్ రంగంవైపు రోజురోజుకి వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే గత వారం మార్కెట్లో కొత్త ఉత్పత్తులు విడుదలయ్యాయి, కొన్ని కార్ల ధరలు కూడా పెరిగాయి. గత వారం దేశీయ మార్కెట్లో అడుగెట్టిన కార్లు, ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకోవచ్చు.

మారుతి సుజుకి బ్రెజ్జా సిఎన్‌జి:
వాహన ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న మారుతి బ్రెజ్జా సిఎన్‌జి రూ. 9.14 లక్షల ప్రారంభ ధర వద్ద విడుదలైంది. ఈ సిఎన్‌జి వెర్షన్ కోసం కంపెనీ రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం ఇప్పటికే ప్రారంభించింది. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉన్న బ్రెజ్జా సిఎన్‌జి మైలేజ్ విషయంలో అద్భుతంగా తయారైంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

2023 కియా కారెన్స్:
ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే గొప్ప అమ్మకాలు పొందుతున్న కియా కారెన్స్, రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ (RDE) ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారైంది. ఈ అప్డేటెడ్ మోడల్ ప్రారంభ ధర రూ. 10.45 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 1.5 లీటర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ కలిగి 157.8 బిహెచ్‌పి పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ iMT యూనిట్ పొందుతుంది. 2023 కియా కారెన్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

సిట్రోయెన్ సి3 కొత్త ధరలు:
ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ తన సి3 కారుని దేశీయ మార్కెట్లో విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది, ఈ తరుణంలో కంపెనీ ఈ హ్యాచ్‌బ్యాక్ ధరలను రూ. 45,000 వరకు పెంచింది. ధరల పెరుగుదల తరువాత సి3 రూ. 6.16 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంది. సిట్రోయెన్ సి3 కొత్త ధరల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

పెరిగిన జీప్ గ్రాండ్ చెరోకీ ధరలు:
దేశీయ విఫణిలో మంచి ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి జీప్ కంపెనీకి చెందిన గ్రాండ్ చెరోకీ. ఈ SUV ధరలు ఇటీవల లక్ష వరకు పెరిగింది. కావున దీని ధర ఇప్పుడు రూ. 78.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 2.0 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‍తో 268 బిహెచ్‌పి పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. జీప్ గ్రాండ్ చెరోకీ కొత్త ధరలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

టయోటా హైలెక్స్ డిస్కౌంట్:
భారతదేశంలో అతి పెద్ద వాహనంగా గుర్తింపు పొందిన టయోటా హైలెక్స్ పికప్ ట్రక్కు కొనుగోలు మీద కంపెనీ రూ. 3.59 లక్షల (స్టాండర్డ్ వేరియంట్) తగ్గింపును ప్రకటించింది. అదే సమయంలో హై వేరియంట్ మ్యాన్యువల్, ఆటోమాటిక్ ధరలను భారీగా పెంచింది. హైలెక్స్ కొత్త ధరలను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top