Year End Offers On Cars 2021: ఇయర్‌ ఎండ్‌ సేల్‌: పలు కార్ల కొనుగోలుపై రూ. లక్ష వరకు తగ్గింపు..! 

Top 5 Year End Offers On Cars - Sakshi

Year End Offers On Cars 2021: మీరు కారు కొనాలనుకుంటున్నారా..! అయితే వెంటనే కొనేయండి. ఎందుకంటే వచ్చే ఏడాది నుంచి దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీలు పలు వాహనాల రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఆయా కార్ల ధరలు భారీగానే పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇయర్‌ ఎండ్‌ కావడంతో పలు ఆటోమొబైల్‌ కంపెనీలు సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. నిస్సాన్, మహీంద్రా, హోండా, హ్యుందాయ్ వంటి వాహన తయారీదారులు ఇయర్‌ ఎండ్‌సేల్‌ను ప్రకటించాయి. ఈ ఆఫర్‌లు డిసెంబర్ 31, 2021 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు చెల్లుబాటుకానున్నాయి.

ఇయర్‌ ఎండ్ సేల్ భాగంగా పలు కార్లపై ఆయా కంపెనీలు అందిస్తోన్న ఆఫర్లు..!

రెనాల్ట్ డస్టర్

రెనాల్ట్ ఇండియా ఈ నెలలో డస్టర్ ఎస్‌యూవీపై గరిష్టంగా రూ. 1.3 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. ఇందులో రూ. 50 000 ఎక్స్‌చేంజ్‌ బెనిఫిట్స్‌, రూ.  50వేల వరకు నగదు తగ్గింపు, రూ. 30 వేల వరకు కార్పొరేట్ తగ్గింపును కొనుగోలుదారులు పొందవచ్చును. కంపెనీ reli.ve స్క్రాప్‌పేజ్ ప్రోగ్రామ్ కింద రూ. 10,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చును.

నిస్సాన్‌ కిక్స్‌ ఎస్‌యూవీ

నిస్సాన్‌ కిక్స్ ఎస్‌యూవీ కొనుగోలుపై ఏకంగా రూ. లక్ష వరకు తగ్గింపును అందిస్తోంది. నిస్సాన్‌ మిడ్-సైజ్ ఎస్‌యూవీ 1.3 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో రానుంది. 1.3 లీటర్ టర్భో పెట్రోల్ వెర్షన్‌పై రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 70 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. కాగా 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ , రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. ఈ రెండు వెర్షన్లపై కొనుగోలుదారులకు రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు, రూ. 5,000 ఆన్‌లైన్ బుకింగ్ బోనస్‌ను కూడా పొందవచ్చును.

మహీంద్రా అల్టురాస్ G4

మహీంద్రా అల్టురాస్ G4 ఎస్‌యూవీ కొనుగోలుపై మహీంద్రా రూ. 81, 500 వరకు తగ్గింపులను ప్రకటించింది. ఇందులో రూ. 50 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 11,500 వరకు కార్పొరేట్ ఆఫర్, రూ. 20,000 వరకు ఇతర ఆఫర్‌లను కొనుగోలుదారులకు మహీంద్రా ప్రకటించింది. 

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్‌​ కొనుగోలుపై గరిష్టంగా రూ. 50వేల వరకు తగ్గింపును పొందవచ్చును. ఈ ఆఫర్స్‌ టర్బో వేరియంట్‌పై మాత్రమే వర్తిస్తాయి. ఇతర పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లు రూ.25,000 వరకు తగ్గింపులను పొందవచ్చును. స్పోర్ట్‌జ్‌ పెట్రోల్ DT వేరియంట్‌పై ఏలాంటి  ప్రత్యేక ఆఫర్‌లు లేవు. సీఎన్‌జీ మోడల్స్‌పై రూ.17,300 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.

హోండా సిటీ

హోండా సిటీ కారుపై హోండా ఇండియా పలు ఆఫర్లను ప్రకటించింది. ఐదోవ తరం హోండా సిటీ సెడాన్‌పై గరిష్టంగా రూ.  45,108 వరకు తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్స్‌ అన్ని వేరియంట్లకు వర్తిస్తాయి. ఇందులో రూ. 7,500 వరకు నగదు తగ్గింపు లేదా రూ. 8,108 వరకు ఎఫ్‌ఓసీ ఉపకరణాలు ఉన్నాయి. వీటితో పాటుగా రూ. 15,000 ఎక్సేచేంజ్‌ బోనస్‌ను కూడా పొందవచ్చు.  అదనపు బెనిఫిట్స్‌లో భాగంగా రూ. 5,000 లాయల్టీ బోనస్, రూ. 9,000 హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్‌, రూ.8,000 కార్పొరేట్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. 

చదవండి: 20 కోట్ల సార్లు కాల్స్‌..! 6 లక్షల 64 వేల మందికి నరకం చూపించిన ఒకే ఒక్క నెంబర్‌..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top