20 కోట్ల సార్లు కాల్స్‌..! 6 లక్షల 64 వేల మందికి నరకం చూపించిన ఒకే ఒక్క నెంబర్‌..!

A Single Number In India Made 202 Million Spam Calls This Year - Sakshi

సుమారు 20.2 కోట్ల సార్లు కాల్స్‌..అందులో 6 లక్షల 64 వేల మంది బాధితులకు నరకం చూపించిన ఒకే ఒక్క నెంబర్‌ అది కూడా స్పామ్‌ కాల్‌(అవాంఛనీయ కాల్స్‌) అని స్టాక్‌హోమ్ ఆధారిత కాలర్ వెరిఫికేషన్ ప్లాట్‌ఫారమ్ ట్రూకాలర్‌ పేర్కొంది. స్పామ్‌ కాల్స్‌ వివరాలపై ట్రూకాలర్‌ ఒక కొత్త నివేదికను విడుదల చేసింది. వార్షిక గ్లోబల్ స్పామ్ నివేదికలో పలు విషయాలును ట్రూకాలర్ బహిర్గతం చేసింది. 

ట్రూకాలర్‌ తన నివేదికలో వెల్లడించిన విషయాలు...!
భారత్‌లో ఒక స్పామర్ సుమారు  202 మిలియన్లకు పైగా స్పామ్ కాల్‌లు చేసినట్లు కాలర్-ఐడెంటిఫికేషన్ సర్వీస్ ట్రూకాలర్‌ షేర్ చేసింది. ప్రతి గంటకు 27 వేల మందిని మొబైల్‌ వినియోగదారులకు చుక్కలు చూపించిందని ట్రూకాలర్‌ వెల్లడించింది. 

ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 2021 వరకు యూజర్లు స్పామ్‌ కాల్‌ డేటాను ట్రూకాలర్‌ రిలీజ్‌ చేసింది. 

భారత్‌లో స్పామ్ కాల్స్‌ విపరీతంగా పెరిగాయని ట్రూకాలర్‌ నివేదిక హైలైట్ చేసింది. 

ప్రపంచంలో అత్యధికంగా స్పామ్ కాల్స్‌ను ఎదుర్కొన దేశాల్లో భారత్‌ 4 వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 9 వ స్థానంలో నిలవడం గమనర్హం. బ్రెజిల్ అగ్రస్థానంలో నిలవగా..పెరూ రెండో స్థానంలో ఉంది. 

భారత్‌లోని మొబైల్‌ యూజర్లకు సరాసరి నెలకు వచ్చే స్పామ్‌ కాల్స్‌ సంఖ్య 16.8గా ఉంది. 

స్పామ్‌ కాల్స్‌లో పూర్తిగా  93 శాతానికి పైగా అమ్మకాలు లేదా టెలిమార్కెటింగ్ కోసం చేసినవేనని ట్రూకాలర్‌ నివేదిక పేర్కొంది. 

అక్టోబర్‌ నాటికి 37.8 బిలియన్ స్పామ్ కాల్స్‌ను బ్లాక్ చేయగా..182 బిలియన్ సందేశాలను బ్లాక్ చేసిందని ట్రూకాలర్‌ వెల్లడించింది.

భారత్‌లో ఎక్కువగా కేవైసీ, ఓటీపీ వివరాలను చెప్పాలంటూ వచ్చే కాల్స్‌ ఎక్కువ స్పామ్‌ కాల్స్‌గా ఉన్నాయి.

చదవండి: యూజర్ల డేటాను ఇతర సంస్థలకు అందిస్తోన్న ట్రూకాలర్‌..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top