రూ.10 లక్షలుంటే.. ఓ కారు మీ సొంతం! | Top 5 Automatic Cars Under Rs 10 Lakh In India | Sakshi
Sakshi News home page

రూ.10 లక్షలుంటే.. ఓ కారు మీ సొంతం!

Apr 24 2026 7:29 PM | Updated on Apr 24 2026 7:58 PM

Top 5 Automatic Cars Under Rs 10 Lakh In India

ఇండియన్ మార్కెట్లో ఆటోమాటిక్ కార్లకు ఇప్పుడు కూడా మంచి డిమాండ్ ఉంది. అయితే వీటికోసం ఎక్కువ డబ్బు కేటాయించాలేమో అనుకుంటే పొరపాటే? ఎందుకంటే దేశీయ విఫణిలో రూ.10 లక్షల (ఎక్స్ షోరూమ్) కంటే తక్కువ ధరకు లభించే కార్లు ఉన్నాయి. ఈ కథనంలో ఆ కార్ల గురించి తెలుసుకుందాం.

కియా సోనెట్
రూ. 10 లక్షల లోపు సెగ్మెంట్‌లోని అత్యంత ప్రీమియం కాంపాక్ట్ SUVలలో ఒకటి కియా సోనెట్. దీని ప్రారంభ ధర రూ.9.94 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఆకట్టుకునే డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందింది. ఇందులోని 83 పీఎస్ పవర్, 115 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 120 పీఎస్ పవర్, 172 ఎన్ఎమ్ టార్క్ అందించే 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 116 పీఎస్ పవర్, 250 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేసే డీజిల్ ఇంజన్ ఉన్నాయి. ఈ ఇంజిన్స్ అన్నీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్స్ పొందుతాయి.

ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, ప్రీమియం బోస్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. ఇది 385-లీటర్ల బూట్ స్పేస్‌ను కూడా అందిస్తుంది.

స్కోడా కైలాక్
స్కోడా కైలాక్ ప్రారంభం: రూ. 9.25 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది మంచి పనితీరును అందించడంతో.. దీనిని ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఇది 1-లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 115 PS పవర్ 178 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సెగ్మెంట్‌లో స్కోడా పూర్తిగా పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌లపై దృష్టి సారించినందున, డీజిల్ ఇంజన్ అందుబాటులో లేదు. ఇందులోని 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ గొప్ప డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

టాటా పంచ్
టాటా పంచ్ ప్రారంభం: రూ. 7.59 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది ఇటీవల ఫేస్‌లిఫ్ట్‌ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఈ కారు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 5 స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను పొందుతుంది. ఈ ఇంజన్ 88 PS, 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పంచ్‌లో డీజిల్ ఇంజన్ అందుబాటులో లేదు.

మారుతి సుజుకి డిజైర్
రూ. 7.62 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే మారుతి సుజుకి డిజైర్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది, ఇది 90 PS పవర్, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో వైర్‌లెస్ కనెక్టివిటీతో కూడిన 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా, చుట్టూ LED లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ ఎయిర్-కాన్, క్రూయిజ్ కంట్రోల్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.

రెనాల్ట్ ట్రైబర్
రెనాల్ట్ ట్రైబర్ ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 8.38 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 72 PS, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపిక లభిస్తుంది. ఇందులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, డిజిటల్ క్లస్టర్, కీలెస్‌ ఎంట్రీ, 625 లీటర్ల బూట్ స్పేస్ మొదలైనవి ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement