
జాతీయ, అంతర్జాతీయంగా ఈ వారంలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. దీంతో సోమవారం స‍్టాక్ మార్కెట్‌లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
సోమవారం ఉదయం 9.30గంటల సమయానికి సెన్సెక్స్ 439 పాయింట్లు నష్టపోయి 56621 వద్ద నిఫ్టీ 143 పాయింట్లు నష్టపోయి 16959 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుంది.
ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. సన్ ఫార్మా, టైటాన్ కంపెనీ, ఏసియన్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, ఎథేర్ మోటార్స్, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.