
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆర్ధిక సంవత్సరం ముగియనుండడం, బ్యాంకుల స్ట్రైక్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి తాజా పరిణామాలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో సోమవారం ఉదయం 9.25గంటల సమయానికి సెన్సెక్స్ 175 పాయింట్లు నష్టపోయి 57134.25 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 49 పాయింట్లు నష్ట పోయి 17103.15 వద్ద ట్రేడ్ కొనసాగుతుంది
క్లిప్లా,బజాజ్ ఆటో,ఐఓసీ, మారుతిసుజికీ, ఓన్‌జీసీ,సన్ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ, భారతీ ఎయిర్‌టెల్, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ,కొటక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీలైఫ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్,యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్, శ్రీ సిమెంట్ షేర్లు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి.