పసిడి మళ్లీ పైపైకి.. తులం ఎంతంటే.. | Today gold and silver rates in Telugu states | Sakshi
Sakshi News home page

పసిడి మళ్లీ పైపైకి.. తులం ఎంతంటే..

Jun 12 2025 11:32 AM | Updated on Jun 12 2025 3:26 PM

Today gold and silver rates in Telugu states

స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే పసిడి ధరలు ఈ రోజు పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో గురువారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.91,000 (22 క్యారెట్స్), రూ.99,280 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.800, రూ.880 పెరిగింది.

చెన్నైలో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.800, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.880 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.91,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.99,280 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.

దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.800 పెరిగి రూ.91,150కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.880 పెరిగి రూ.99,430 వద్దకు చేరింది.

Gold Price: మళ్లీ రూ.లక్ష దాటిన బంగారం ధర

వెండి ధరలు

బంగారం ధరల మాదిరిగా కాకుండా గురువారం వెండి ధర(Silver Prices)లు తగ్గాయి. కేజీ వెండి రేటు నిన్నటితో పోలిస్తే రూ.100 క్షీణించింది. దాంతో కేజీ సిల్వర్‌ ధర రూ.1,18,900గా ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement