ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడేవారిపై సైబర్‌ నేరస్తుల దాడులు..!

Thousands Of Gamers Targeted In A New Cyberattack - Sakshi

Thousands Of Gamers Targeted In A New Cyberattack: మన నిత్యజీవితంలో స్మార్ట్‌ఫోన్స్‌, ఇంటర్నెట్‌ ఓక భాగమైపోయింది. చౌక ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్స్‌ రాకతో  తరుచూ ఆన్‌లైన్‌లో ఉంటూ..ఎప్పుడు ఎదో ఒక అంశంపై బ్రౌజ్‌ చేస్తు కాలక్షేపం చేస్తున్నాం. దీంతో ఇంటర్నెట్‌ వాడే యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడే వారి సంఖ్య బాగా పెరిగింది. అదేస్థాయిలో సైబర్‌ నేరస్తులు యూజర్లపై దాడిచేస్తున్నారు. హ్యకర్లు కూడా కొత్త పుంతలను తొక్కుతూ...రకరకాలుగా దాడులకు పాల్పడుతున్నారు. సైబర్‌ నేరస్తులు రూట్‌ మార్చి గేమ్స్‌ ఆడే వారిపై విరుచుకుపడుతున్నట్లు ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కై పరిశోధకులు తన నివేదికలో వెల్లడించారు. 
చదవండి: Xiaomi: బెల్ట్‌తో పేమెంట్స్‌...! టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణ..!

ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడే వారేలక్ష్యంగా దాడులు..!
సైబర్ నేరగాళ్లు బ్లడీస్టీలర్ అని పిలువబడే కొత్త మాల్వేర్‌తో ఎక్కువగా  గేమర్స్‌ను,  వారి ఖాతాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారని కాస్పర్‌ స్కై పేర్కొంది. బ్లడీస్టీలర్ మాల్వేర్‌తో సెషన్ డేటా , పాస్‌వర్డ్స్‌,  కుకీ ఎక్స్‌ఫిల్ట్రేషన్‌ను హ్యకర్లు పొందుతున్నట్లు కాస్పర్‌స్కై పేర్కొంది. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడే యూజర్ల బ్యాంక్‌ కార్డ్‌ వివరాలను, బ్రౌజర్‌ ఆటోఫిల్‌డేటా, స్మార్ట్‌ఫోన్స్‌, కంప్యూటర్ల నుంచి స్క్రీన్‌ షాట్‌లను  హ్యాకర్లు సేకరిస్తున్నట్లు తెలిసింది. 

కాస్పర్‌ స్కై నివేదిక ప్రకారం... ఎపిక్ గేమ్స్, స్టీమ్‌, ఆరిజిన్‌, గాగ్‌. కామ్‌(GOG.com), బెథెస్డా, టెలిగ్రామ్, వైమ్‌ వరల్డ్‌ వంటి ఫ్లాట్‌ఫామ్స్‌ యూజర్ల సెషన్ వివరాలను హ్యకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ స్టోర్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన జీటీఏ ఫైవ్‌, ఫార్ట్‌నైట్‌, బ్యాటిల్‌ ఫీల్డ్‌,ఫిఫా 2022 గేమ్స్‌ ఉన్నాయి. రష్యన్‌ ఫోరమ్‌లో బ్లడీస్టీలర్‌ అనే మాల్వేర్‌ తొలిసారిగా మార్చి 2021లో కాస్పర్‌స్కై గుర్తించింది. ఈ మాల్వేర్‌ సహాయంతో గేమర్స్‌ నుంచి టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా యూజర్ల నుంచి డబ్బులను వసూలు చేస్తోన్నట్లు కాస్పర్‌స్కై పేర్కొంది. 
చదవండి: జియో ఫోన్‌ లాంచ్‌కు ముందు..మరో కంపెనీపై ముఖేశ్‌ అంబానీ కన్ను..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top