Mukesh Ambani: జియో ఫోన్‌ లాంచ్‌కు ముందు..మరో కంపెనీపై ముఖేశ్‌ అంబానీ కన్ను..!

Glance That May Have Caught Mukesh Ambani Eye - Sakshi

రిలయన్స్‌ చేయని వ్యాపారం అంటూ ఏది లేదు. టెలికాం, ఇంటెర్నెట్‌ సేవలు, ఈ-కామర్స్‌, రిటైల్‌ నెట్‌వర్క్‌, చమురు, గ్యాస్‌ ఇలా వివిధరంగాల్లో రిలయన్స్‌ విస్తరిస్తూనే ఉంది. రిలయన్స్‌ తన స్వంత ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేస్తూన్న తరుణంలో ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విస్తృత శ్రేణిపై రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 
చదవండి: 35వేల కోట్ల జరిమానా సరే! యాపిల్‌ సంగతేంది?

ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్స్‌ ఫీచర్‌ను అందించే కంపెనీపై తాజాగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ కన్ను వేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్స్‌ లాక్‌ పడినప్పుడు వచ్చే న్యూస్‌, ఫోటోస్‌ను అందించే గ్లాన్స్‌ ఫీచర్‌ ముఖేశ్‌ అంబానీ ఎంతగానో ఆకర్షించినట్లు తెలుస్తోంది. గ్లాన్స్‌లో సుమారు 300 మిలియన​ డాలర్లను పెట్టుబడి పెట్టేందుకు ముఖేశ్‌ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.   

అసలు ఏంటీ గ్లాన్స్‌..!
గ్లాన్స్ అనేది యాప్ కాదు, ఇది ఆండ్రాయిడ్ ఫోన్‌లలో అంతర్నిర్మిత ఫీచర్. దీనిని బెంగుళూరుకు చెందిన ఇన్‌మొబి కంపెనీ రూపొందించింది. స్మార్ట్‌ఫోన్‌లలో గ్లాన్స్ ఎనేబుల్ చేసిన యూజర్లు తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మేల్కొన్నప్పుడు, వారు తప్పనిసరిగా న్యూస్ హెడ్‌లైన్‌తో ఆకర్షణీయమైన చిత్రాన్ని గమనిస్తారు. యూజర్లు వారి స్మార్ట్‌ఫోన్‌లో ఒకసారి కుడివైపుకి స్వైప్ చేస్తే, వారు లైవ్స్ వీడియోస్‌,  షార్ట్ వీడియో కంటెంట్‌ను, ఫోటో స్టోరీలను చూడవచ్చు,  అంతేకాకుండా పలు గేమ్స్‌ను కూడా  ఆడవచ్చును. వార్తలు, వినోదం, టెక్, క్రీడలు, ఫ్యాషన్ , ట్రావెలింగ్‌ వంటి అంశాలను లాక్ స్క్రీన్‌లో గ్లాన్స్‌ అందిస్తుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీతో పాటు మరిన్నీ భారతీయ భాషలను గ్లాన్స్‌ అందిస్తోంది.  
చదవండి: Anand Mahindra: తాలిబన్ల ఇలాకాలో ఆ ఛాన్స్‌ వస్తేనా..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top