
ఆగస్టు 4న ముంబైలోని బాంద్రా కుర్లా కాంపెక్స్‌లో తన మొదటి చార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు టెస్లా ఇదివరకే వెల్లడించింది. చెప్పినట్లుగానే ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించింది. ఇందులో నాలుగు వీ4 సూపర్‌చార్జింగ్ స్టాల్స్(డీసీ చార్జింగ్), నాలుగు డెస్టినేషన్ చార్జింగ్ స్టాల్స్(ఏసీ చార్జింగ్) ఉన్నాయి.
వీ4 సూపర్‌చార్జర్‌లు కిలోవాట్‌కి రూ.24, డెస్టినేషన్ చార్జర్‌లు కిలోవాట్‌కి రూ.14 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సెప్టెంబర్ చివరి కల్లా ముంబైలోని లోయర్ పరేల్, థానే, నవీ ముంబై ప్రాంతాల్లో కొత్త చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని కంపెనీ వివరించింది.
ఢిల్లీలో రెండో షోరూం
టెస్లా తన రెండో షోరూంను ఢిల్లీలోని ఏరోసిటీ(వరల్డ్ మార్క్ 3)లో ఆగస్టు 11న రెండో షోరూం ప్రారంభించనుంది. కాగా తొలి షోరూంను జూలై 15న ముంబైలోని బాంద్రా కుర్లా కాంపెక్స్‌లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: జులైలో ఎక్కువమంది కొన్న కారు ఏదంటే?
టెస్లా మోడల్ వై
భారతదేశంలో టెస్లా మోడల్ వై కారును ప్రారంభించిన తరువాత.. కంపెనీ బుకింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కారును ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై నగరాల్లో మాత్రమే బుక్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో సంస్థ మరిన్ని నగరాలకు విస్తరించనుంది.
టెస్లా ఎంట్రీ-లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెండు మోడళ్ల డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్‌పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్‌పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది.