ఎక్సెల్‌లో కొత్త ఫీచర్లు.. చిరకాల డిమాండ్‌ నెరవేర్చిన మైక్రోసాఫ్ట్‌

Tech giant Microsoft is reportedly adding support for hyperlinks feature to Excel - Sakshi

మైక్రోసాఫ్ట్‌ చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న యూజర్ల డిమాండ్‌ని నెరవేర్చింది. మైక్రోసాఫ్ట్‌ అందిస్తున్న సాఫ్ట్‌వేర్‌లు మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా, ఎఫెక్టివ్‌గా ఉండేలా సరికొత్త ఫీచర్లు యాడ్‌ చేసింది. అందులో భాగంగా ఎక్సెల్‌లో హైపర్‌లింక్‌ ఫీచర్‌ని యాడ్‌ చేయాలని నిర్ణయించింది. మైక్రోసాఫ్ట్‌ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం ఎక్సెల్‌లో హైపర్‌లింక్‌ ఆప్షన్‌ని మోడర్న్‌ కామెంట్స్‌ విభాగంలో అందించింది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి రావడం వల్ల స్ప్రెడ్‌షీట్‌లో వర్క్‌ చేసేప్పుడు మరింత సమాచారాన్ని వెబ్‌ నుంచి తెలుసుకునేందుకు అవకాశం కలుగుతుంది.

ఎక్సెల్‌లో హైపర్‌ లింక్‌ ఫీచర్‌ ఇవ్వలనే డిమాండ్‌ చాన్నాళ్లుగా ఉంది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే సపోర్టింగ్‌ ఇన్ఫర్మేషన్‌ సులువుగా అందించే వీలుందని యూజర్లు చెబుతూ వచ్చారు. కాగా తాజాగా ఈ ఫీచర్‌ని యాడ్‌ చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ ముందుకు వచ్చింది. 2022 ఫిబ్రవరిలో ఈ ఫీచర్‌ మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top