breaking news
Exel
-
ఎక్సెల్లో కొత్త ఫీచర్లు.. చిరకాల డిమాండ్ నెరవేర్చిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న యూజర్ల డిమాండ్‌ని నెరవేర్చింది. మైక్రోసాఫ్ట్ అందిస్తున్న సాఫ్ట్వేర్లు మరింత యూజర్ ఫ్రెండ్లీగా, ఎఫెక్టివ్‌గా ఉండేలా సరికొత్త ఫీచర్లు యాడ్ చేసింది. అందులో భాగంగా ఎక్సెల్లో హైపర్లింక్ ఫీచర్‌ని యాడ్ చేయాలని నిర్ణయించింది. మైక్రోసాఫ్ట్ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం ఎక్సెల్లో హైపర్లింక్ ఆప్షన్ని మోడర్న్ కామెంట్స్ విభాగంలో అందించింది. ఈ ఫీచర్ అందుబాటులోకి రావడం వల్ల స్ప్రెడ్‌షీట్‌లో వర్క్ చేసేప్పుడు మరింత సమాచారాన్ని వెబ్ నుంచి తెలుసుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఎక్సెల్లో హైపర్ లింక్ ఫీచర్ ఇవ్వలనే డిమాండ్ చాన్నాళ్లుగా ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ సులువుగా అందించే వీలుందని యూజర్లు చెబుతూ వచ్చారు. కాగా తాజాగా ఈ ఫీచర్‌ని యాడ్ చేసేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చింది. 2022 ఫిబ్రవరిలో ఈ ఫీచర్ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. -
ప్రింటోనికా, శివరామ కలర్ ల్యాబ్‌కు ప్రింట్ ఎక్స్‌ల్ అవార్డ్సు
దానవాయిపేట (రాజమహేంద్రవరం) : ప్రతిష్టాత్మకమైన హెచ్‌పీ ఆసియా పసిఫిక్ అండ్ జపాన్ ప్రింట్ ఎక్స్‌ల్ –2017 అవార్డ్సును ప్రముఖ ప్రింటింగ్ కంపెనీ ప్రింటోనికా, శివరామ కలర్ ల్యాబ్ అందుకుంది. ఈ నెల 8న చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రింటోనికా, శివరామ కలర్ ల్యాబ్ సంస్థల డైరెక్టర్ పులవర్తి విశ్వేశరావు, టెక్నికిల్ హెడ్ ఈలి సతీష్, గ్రాఫిక్స్ డివిజన్ ప్రింట్ టీమ్ ఎంవీ గోపీనాథ్‌లు హెచ్‌పీ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు అలెన్బార్ షానీ, హెచ్‌పీ హెడ్ టీమ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఆసియా పసిఫిక్ దేశాల నుంచి సుమారు 1400 ప్రముఖ ప్రింటింగ్ కంపెనీలు ఈ పోటీల్లో పాల్గొనగా ఫొటో బుక్ , కమర్షియల్ ప్రింటింగ్ కేటగిరీలలో ఇన్నోవేషన్, ప్రెజెంటేషన్, టెక్నాలజీని ఆధారం చేసుకుని ఉత్తమ ఫొటో బుక్ విన్నర్, కమర్షియల్ ప్రింట్ కేటగిరీ విన్నర్, ఓవర్ఆల్ గ్రాండ్ విన్నర్ అవార్డులను సంస్థ కైవసం చేసుకుంది. 2012 నుంచి 2017 వరకు వరుసగా ఇంటర్నేషనల్ ప్రింట్ ఎక్స్‌ల్ అవార్డులను అందుకున్న ప్రింటోనికా, శివరామ కలర్ ల్యాబ్ సంస్థను హెచ్‌పీ ఇంటర్నేషనల్, హెచ్‌పీ భారత్ టీమ్ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సత్యవరపు గోపాలకృష్ణ మాట్లాడుతూ గిగిగి .pటజీn్టౌnజీఛ్చి.ఛిౌఝ ద్వారా జాతీయ, అంతర్జాతీయ ఆన్లైన్ ప్రింటింగ్ సేవలను ప్రపంచ స్థాయిలో తమ వినియోగదారులకు అందజేస్తున్నామన్నారు. అడ్వాన్స్ డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీతో లైఫ్ టైమ్ ప్రింట్ క్వాలిటీతో లైట్ వైట్ వాటర్ ప్రూప్ ఫొటోబుక్స్ భారతదేశంలోని పలు ఫొటోగ్రాఫీ ప్రొఫెషనల్స్‌కు ,గ్రాఫిక్ డిజైనర్లకు సేవలందిస్తున్నామని తెలిపారు.