టీసీఎస్‌ కొత్త సీఈవో ట్రాక్‌ రికార్డ్, జీతం ఎలా ఉన్నాయంటే?

TCS new CEO designate K Krithivasan track record and salary deets - Sakshi

సాక్షి, ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)  సీఎండీ  రాజేష్ గోపీనాథన్ రాజీనామా చేసిన  నేపథ్యంలో ఆయన స్థానంలో కంపెనీ వెటరన్‌ కె. కృతివాసన్‌  కొత్త సీఈవోగా నియమితులయ్యారు.సంస్థ  బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్‌ ఇన్సూరెన్స్ (BFSI) బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్‌గా ఉన్న కృతివాసన్  కొత్త సీఈవోగా మార్చి 16న బాధ్యతలు చేపట్టారు. (గాల్లో తేలినట్టుంది..నెక్ట్స్‌ ఏంటి? టీసీఎస్‌ గోపీనాథన్‌ కీలక వ్యాఖ్యలు)

చెన్నై నుంచి ముంబైక షిప్ట్‌ అవ్వడమే పెద్ద చాలెంజ్‌
టీసీఎస్‌ సీఈవోగా కంటే, చెన్నై వదిలి ముంబైకి మారడమే పెద్ద సవాల్‌ అని  సీఈవోగా ఎంపికైన తరువాత తొలిసారి నిర్వహించిన శుక్రవారం నాటి మీడియా మీట్‌లో కృతివాసన్ చమత్కరించారు. మార్కెట్లో  వచ్చే  ప్రతి సవాల్‌  ఒక కొత్త అవకాశమని పేర్కొన్నారు. టాప్‌ఇండియన్‌ ఐటీ కంపెనీల సహచరులతో పోలిస్తే చాలా ఆలస్యంగా 58 ఏళ్లకు  కీలక పదవికి ఎంపికయ్యారు అనేది నిపుణుల మాట.

కాగా కీలక సమయంలో గత ఆరేళ్లుగా  కంపెనీకి సీఎండీగా ఉన్న గోపీనాథన్‌, కంపెనీ చరిత్రలోనే తొలిసారి నాలుగేళ్ల ముందే కంపెనీని వీడారు. అయితే కృతివాసన్‌కు బాధ్యతల అప్పగింతల్లో భాగంగా గోపీనాథన్‌ సెప్టెంబర్ 15 దాకా కంపెనీలో కొనసాగుతారు. తాజాగా  కొత్త సీఈవో కృతివాసన్‌ సీఈవో, చదువు తదితర అంశాలపై భారీ ఆసక్తి నెలకొంది. అయితే కొత్త సీఈవో కృతివాసన్‌  సీఈవో, చదువు తదితర అంశాలపై భారీ ఆసక్తి నెలకొంది.

అత్యధిక వేతనం పొందుతున్న ఐటీ దిగ్గజాల సీఈవోల జాబితాలో గోపీనాథన్ ఐదో స్థానంలో ఉన్నారు. 2021-22 లో రూ. 25.75 కోట్లగా ఉన్న జీవితం 2023-23లో 26.6 శాతం పెరిగింది. దీంతో కృతివాసన్‌ ఎంత వేతనం పొందనున్నారనేది హాట్‌టాపిక్‌గా నిలిచింది.

ఎవరీ కృతివాసన్
చెన్నైకి చెందిన కృతివాసన్ 1989లో టీసీఎస్‌లో చేరారు. 34 సంవత్సరాలకు పైగా  కంపెనీకి సేవలందిస్తున్నారు. హంబుల్‌గా, ప్రేమగా ఉండే కృతివాసన్‌కి అంతర్గతంగా మంచి గుర్తింపు ఉందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.  మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని, ఐఐటీ కాన్పూర్ నుండి ఇండస్ట్రియల్ అండ్ మేనేజ్‌మెంట్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. టీసీఎస్‌లో కీర్తివాసన్ డెలివరీ, కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్‌మెంట్, లార్జ్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ మరియు సేల్స్‌లో వివిధ బాధ్యతలు, ఇతర రోల్స్‌  నిర్వహించారు. అలాగే టీసీఎస్‌ Iberoamerica ,  ఐర్లాండ్  డైరెక్టర్ల బోర్డు సభ్యుడుగాను, టీసీఎస్‌  టెక్నాలజీ సొల్యూషన్స్  ఏజీ పర్యవేక్షక బోర్డు. సభ్యుడుగాను ఉన్నారు.

కృతివాసన్ శాలరీ
అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగులలో ఒకరైన కె. కృతివాసన్ 2018-19లో రూ. 4.3 కోట్ల జీతం తీసుకున్నారు. తాజా పదోన్నతితో ఎంత ప్యాకేజీ, ఇతర ప్రయోజనలు లభించనున్నాయనేది ప్రస్తుతానికి సస్పెన్సే. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top