ఐపీఎల్‌ 2021.. టాటా సఫారీ సర్‌ప్రైజ్‌ ఎంట్రీ!

Tata Safari Gold Edition Will Reveal In UAE During IPL - Sakshi

త్వరలో దుబాయ్‌లో జరగబోతున్న ఐపీఎల్‌ 2021 సందర్భంగా ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చేందుకు టాటా సఫారీ సిద్ధమైంది. గత రెండు దశాబ్ధాలుగా భారతీయ రోడ్లపై పరుగులు పెడుతున్న ఈ కారు సరికొత్త రూపంలో దర్శనం ఇచ్చేందుకు బీ రెడీ అంటోంది. 

గోల్డ్‌ ఎడిషన్‌
రెండు దశాబ్దాలుగా ఇండియన్‌ రోడ్లపై టాటా సఫారీలు రయ్‌ రయ్‌ మంటూ దూసుకెళ్తున్నాయి. ఈ ఇరవై ఏళ్లలో ఏ‍న్నో కొత్త కార్లు వచ్చినా సఫారీ స్థానం చెక్కు చెదరలేదు. అలాంటి టాటా సఫారీ ఈసారి బంగారు రూపం సంతరించుకోనుంది. గతానికి భిన్నంగా గోల్డ్‌ ఎడిషన్‌ను తెస్తోంది టాటా మోటార్స్‌.

కొత్త రంగుల్లో
ఇరవై ఏళ్లలో టాటా సఫారీలు కేవలం ఐదు రంగుల్లోనే మార్కెట్‌లోకి వచ్చాయి. అందులో రాయల్‌ బ్లూ, ట్రోపికల్‌ మిస్ట్‌, డేటోనా గ్రే, ఓర్కస్‌ వైట్‌, ట్రోపికల్ మిస్ట్‌ అడ్వెంచర్‌ వంటి ఐదు రంగుల్లోనే అభిమానులను అలరించింది. కానీ ఈ సారి ఏకంగా పూర్తిగా బంగారు రంగులో రాబోతుంది. ఐపీఎల్‌ 2021కి టాటా మోటార్స్‌ అఫీషియల్‌ స్పాన్సర్‌గా ఉంది. దీంతో ఐపీఎల్‌ వేదికగా గోల్డ్‌ ఎడిషన్‌ను పరిచయం చేనుంది.

స్పెషల్‌ ఎడిషన్స్‌
ఇప్పటికే టాటా సంస్థ ఆల్ట్రోజ్‌లో గోల్డ్‌ ఎడిషన్‌ను తీసుకువచ్చింది. ఆ తర్వాత సఫారీకి ఈ ఎడిషన్‌ను విస్తరించనుంది. గోల్డ్‌ ఎడిషన్‌తో పాటు హారియర్‌ కార్లలో డార్క్‌ ఎడిషన్‌ను కూడా ప్రత్యేకంగా తెచ్చింది టాటా మోటార్స్‌. టాటా సఫారీలో 2 లీటర్‌ టర్బో ఛార్జెడ్‌ కైరోటీ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్‌ 1750 నుంచి 2500 రేంజ్‌లో ఆర్‌పీఎంని అందిస్తుంది. టాటా సఫారీ ఎక్స్‌షోరూం ధరలు రూ.14.99 లక్షల నుంచి ప్రారంభం అవుతున్నాయి.

చదవండి : Neeraj Chopra: ‘టాటా ఏఐఏ’ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నీరజ్‌ చోప్రా

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top