'టాటా న్యూ యాప్‌ లాంచ్‌, రతన్‌ టాటా మాస్టర్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా!

Tata Neu launch on April 7 - Sakshi

ప్రముఖ టాటా గ్రూప్‌ దిగ్గజం ఐటీ, ఆటోమొబైల్‌, ఎవియేషన్‌ ఇలా అన్నీ రంగాల్లో సత్తా చాటుతోంది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రత్యర్ధులకు చెక్‌ పెడుతోంది. తాజాగా అమెజాన్‌, టెలికాం దిగ్గజం జియోలకు పోటీగా గురువారం 'టాటా న్యూ'పేరుతో యాప్‌ను విడుదల చేసింది. అయితే ఈ యాప్‌ విడుదలలో టాటా గ్రూప్‌ అధినేత 'రతన్‌ టాటా' మాస్టర్‌ ప్లాన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇటీవల 69ఏళ్ల సుధీర్ఘ విరామం తర్వాత నష్టాల ఊబిలో ఉన్న ఎయిరిండియాను టాటా గ్రూప్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌ 8న టాటా గ్రూప్‌ అనుబంధ సంస్థ ట్యాలెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బిడ్డింగ్‌ వేసి రూ.18వేలకోట్లకు బిడ్డింగ్‌ ఎయిరిండియాను దక్కించుకుంది. ఇప్పుడీ సంస‍్థ మళ్లీ లాభాల పట్టేలా రతన్‌ టాటా మాస్టర్‌ ప్లాన్‌ వేసినట్లు తెలుస్తోంది. అదే 'టాటా న్యూ' యాప్‌. 

టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఆసక్తిర వ్యాఖ్యలు
టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఎయిరిండియాను ఆర్ధికంగా, టెక్నాలజీ పరంగా ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెడతామని అన్నారు. అదే సమయంలో టాటా న్యూ యాప్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ప్రతీ ఒక్క ప్రాంతానికి ఎయిరిండియా సర్వీస్‌లను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఎయిరిండియా సేవల్ని డిజిటల్‌ మార్గాల ద్వారా  వినియోగదారులకు అందించేందుకు టాటా న్యూ'ను విడుదల చేస్తున్నట్లు, ఈ యాప్‌తో పాటు సోషల్‌ మీడియా, వెబ్‌సైట్‌లను రూపొందిస్తున్నట్లు చెప్పారు. చెప్పినట్లుగానే టాటా గ్రూప్‌ ఈ యాప్‌ను ఇవాళ ప్రజలకు పరిచయం చేసింది. ఈ యాప్‌ ద్వారా త్వరలో ఎయిరిండియా సేవలు ప్రారంభం కానున్నాయి.

 

ఇక ఈ యాప్‌ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం. 
ఇప్పటి వరకు ఈ యాప్‌ టాటా గ్రూప్ ఉద్యోగుల కోసం మాత్రమే అందుబాటులో ఉండగా నేటి నుంచి అందరికీ అందుబాటులో తెచ్చింది. విమానయాన సంస్థలు, హోటళ్లు, మెడిసిన్‌, కిరాణా సామాగ్రిని ఇలా అన్నీ సర్వీసులు ఒకే వేదికపై వినియోగించుకోవచ్చు.  

అప్లికేషన్ వినియోగదారులకు అనేక రకాల టాటా సేవలను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. తాజ్‌తో హోటల్‌లను బుకింగ్, విమానాల కోసం ఎయిర్‌ ఏసియా, ఎలక్ట్రానిక్స్ కొనుగోలు కోసం క్రోమా, బ్యూటీ, లగ్జరీ ఉత్పత్తుల కోసం, శాటిలైట్ టీవీని వీక్షించేందుకు టాటా స్కైను ఈ యాప్‌లో పేమెంట్స్‌ చేయోచ్చు. 

నీయూ యాప్‌లో బిగ్‌ బాస్కెట్‌, 1ఎంజీ (మెడిసిన్‌ ) వంటి సేవలు ఉన్నాయి. 

యాప్ వినియోగదారులను వారి బిల్లులను చెల్లించడానికి అనుమతిస్తుంది. వ్యక్తిగత రుణాలు, ఇన్స్యూరెన్స్‌ పాలసీలను కూడా అందిస్తుంది.

అమెజాన్‌,స్విగ్గీ,నైకా వంటి యాప్‌లతో పోలిస్తే డిజైన్ అద్భుతంగా ఉందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.  

యాప్‌ వినియోగదారులు ఎంపిక చేసిన బ్రాండ్‌ల నుండి రివార్డ్ పాయింట్‌లను  పొందవచ్చు.

చదవండి: మొత్తం మీరే చేశారు! టాటా చేతికి ఎయిర్ ఇండియా, లోక్ సభలో ఆసక్తికర చర్చ! 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top