టాటా ప్యాసింజర్‌ ఈవీ రైడ్‌ | Sakshi
Sakshi News home page

టాటా ప్యాసింజర్‌ ఈవీ రైడ్‌

Published Sat, Jan 6 2024 4:25 AM

Tata Motors introduces first pure EV architecture called acti.ev - Sakshi

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ వాహన విభాగమైన టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ వచ్చే ఏడాదిన్నరలో అయిదుకుపైగా ఈవీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పూర్తి స్థాయి ఆధునిక ఎలక్ట్రిక్‌ వాహన వ్యవస్థ అయిన యాక్టి.ఈవీ ప్లాట్‌ఫామ్‌పై విభిన్న బాడీ, సైజుల్లో ఇవి రూపుదిద్దుకుంటాయని కంపెనీ శుక్రవారం వెల్లడించింది. యాక్టి.ఈవీ ఆధారంగా తొలుత పంచ్‌ ఈవీ వస్తోందని ప్రకటించింది.

ఈ ఈవీ మోడళ్లలో 300 నుండి 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించే యాక్టి.ఈవీ బ్యాటరీ ప్యాక్‌లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. గ్లోబల్‌ ఎన్‌సీఏపీ, భారత్‌ ఎన్‌సీఏపీ భద్రతా ప్రమాణాలను అనుసరించి మోడళ్ల తయారీ చేపడతామని టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ చీఫ్‌ ప్రొడక్ట్స్‌ ఆఫీసర్‌ ఆనంద్‌ కులకర్ణి తెలిపారు. కాగా, పంచ్‌ ఈవీ బుకింగ్స్‌ ప్రారంభం అయ్యాయి. రూ.21,000 చెల్లించి కారు బుక్‌ చేసుకోవచ్చు.

Advertisement
Advertisement